ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లి జరిగిందంటే కెరీర్ క్లోజ్ అయినట్లే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నారు. దీంతో మనసుకు నచ్చినవాడు దొరికితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నా కూడా పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న తమన్నా.. 34 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తుంది.
అయితే గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. చాలా రోజుల క్రితమే ఈ జంట తాము ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా రివీల్ చేశారు. ఇక రేపో మాపో విజయ్ వర్మతో తమన్నా పెళ్లి పీటలు ఎక్కుతుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమన్నా ఊ అంటే మూడు ముళ్ళు వేయడానికి విజయ్ వర్మ కూడా రెడీగా ఉన్నాడు.
కానీ తమన్నా మాత్రం పెళ్లి విషయంలో వెనకడుగు వేస్తోంది. తాజాగా కూడా ఓ ఈవెంట్ లో పెళ్లి పై ప్రశ్నలు ఎదురవగా.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తనకు మ్యారేజ్ చేసుకునే మూడ్ లేదని చెబుతూ బాయ్ ఫ్రెండ్ కు ఒక రకంగా తమన్నా బిగ్ షాక్ ఇచ్చింది. దాదాపు రెండున్నరేళ్ల నుంచి విజయ్ వర్మ తమన్నా లవ్ లో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అయిప్పటికీ వెళ్లి అంటే మాత్రం తమన్నా ఎందుకు సతాయిస్తుందో ఎవరికి అంతుచిక్కడం లేదు.
కాగా, కెరీర్ విషయానికి వస్తే.. కొత్త హీరోయిన్ల రాకతో టాప్ హీరోలంతా తమన్నాను పక్కన పెట్టేశారు. దాంతో తమన్నా సీనియర్ హీరోలతో జత కడుతుంది. సౌత్ మరియు నార్త్ లో సినిమా, వెబ్ సిరీస్ లతో పాటు వరుసగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ఒదెల 2లో తమన్నా ప్రధాన పాత్రను పోషిస్తోంది. మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది.