చాలామంది సినీ తారలు ఓవైపు యాక్టింగ్ ప్రొఫెషన్ ను కొనసాగిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి చక్రం తిప్పుతూ ఉంటారు. ఈ జాబితాలో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కూడా ఒకరు. నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య.. హీరోగా నిలదొక్కుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల చెంత చేరలేకపోయినా టైర్ 2 హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు. మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూకుడు చూపిస్తున్నాడు.
2022లో నాగ చైతన్య హైదరాబాద్‌లో గౌర్మెట్ సౌత్-ఈస్ట్-ఆసియన్ వంటకాల్లో ప్రత్యేకత కలిగిన షోయు అనే క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించి ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో ఉన్న ఈ కిచెన్ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలను హైదరాబాద్ ఆహార ప్రియులకు అందిస్తుంది. అలాగే షోయు రుచికరమైన ఆహారంపై మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూలమైన ప్యాకేజింగ్‌పై కూడా దృష్టి సారించి అందరి ప్రశంసలు అందుకుంది.
అనతి కాలంలోనే హైదరాబాద్ లో ఉన్న టాప్-10 రెస్టారెంట్స్ లో ఒకటిగా షోయు ప్రసిద్ధి చెందింది. షోయు ద్వారా నాగ చైతన్య హీరోగా కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అవును, నాగ చైతన్య ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. కానీ క్లౌడ్ కిచెన్ రోజూవారీ ఆదాయమే రూ. 2 నుంచి 3 లక్షల వరకు ఉంటుందట. వీకెండ్స్ లో డబుల్ ఇన్‌కమ్ వస్తుందట. కేవలం షోయు నుండి ఏడాదికి నాగ చైతన్య రూ. 10 కోట్ల వరకు ఆదాయం పొందుతున్నాడని ఇన్‌సైడ్ జోరుగా ప్రచారం జరుగుతోంది.