Moviesఆ క్రికెటర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న మేఘా ఆకాష్.. చివరికి..?

ఆ క్రికెటర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న మేఘా ఆకాష్.. చివరికి..?

నితిన్ హీరోగా వచ్చిన లై మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్.. మొదటి సినిమానే మేఘా ఆకాష్ కి మంత్రి గుర్తింపు తెచ్చి పెట్టడంతో ఆ తర్వాత తెలుగులో చల్ మోహన్ రంగా, డియర్ మేఘ, మను చరిత్ర, రావణాసుర వంటి తెలుగు సినిమాల్లో నటించింది. అలాగే తమిళ, హిందీ భాషల్లో కూడా మేఘా ఆకాష్ కొన్ని సినిమాలు చేసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన సాయి విష్ణు అనే అబ్బాయిని పెళ్లాడింది.

అయితే వీరు గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారట. ఎట్టకేలకు ఆరు సంవత్సరాల ప్రేమకు తెరపడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక వీరి పెళ్లి, రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఇదంతా పక్కన పెడితే చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకునే వారి కంటే ముందే మరికొంతమందితో ప్రేమలో పడుతూ ఉంటారు. అయితే మేఘా ఆకాష్ కూడా ఓ క్రికెటర్ తో గాఢమైన ప్రేమలో మునిగిపోయిందట. మరి ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు? ఎందుకు వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.

మేఘా ఆకాష్ అంతగా ప్రేమించిన క్రికెటర్ ఎవరో కాదు ఎంఎస్ ధోని.. అవును మీరు వినేది నిజమే. చిన్నప్పటినుండి ఎంఎస్ ధోని అభిమానిగా పెరిగిన మేఘా ఆకాష్ ఆయన్ని చాలా అమితంగా ప్రేమించిందట. అలా మేఘా ఆకాష్ పెరుగుతున్నా కొద్దీ ధోని మీద ప్రేమను కూడా పెంచుకుంటూ తన రూమ్ నిండా ధోని కి సంబంధించిన ఫోటోలనే పెట్టుకునేదట.అలా ధోనీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన మేఘా ఆకాష్ కి ఓసారి హార్ట్ బ్రేక్ అయిందట. అదేంటంటే.. ధోని ఎప్పుడైతే సాక్షి ని పెళ్లి చేసుకున్నాడో అదే రోజు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట.

అంతేకాదు ఆ సమయంలో నా హార్ట్ బ్రేక్ అయింది అంటూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ ఇంటర్వ్యూలో మేఘ ఆకాష్ చెప్పింది.అయితే ధోనికి పెళ్లయిన సమయంలో మేఘా ఆకాష్ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఇక అప్పటికే మేఘా ఆకాష్ తన ఫ్యామిలీ వారితో నేను పెళ్ళంటూ చేసుకుంటే ధోనినే చేసుకుంటాను. ఆయన్ని తప్ప మరెవరిని పెళ్లాడను అని ప్రతిసారి చెప్పేదట. కానీ ఏదో చిన్నతనంలో అలా మాట్లాడుతుంది అని తల్లిదండ్రులు అనుకునేవారట. ఇక ధోని కి పెళ్లి పెళ్లవ్వడంతో హార్ట్ బ్రేక్ అయినా మేఘా ఆకాష్ అదే నా ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news