Moviesతండ్రిని కాదని ఆయన్ని గుడ్డిగా ఫాలో అవుతున్న జాన్వీ కపూర్..?

తండ్రిని కాదని ఆయన్ని గుడ్డిగా ఫాలో అవుతున్న జాన్వీ కపూర్..?

చాలామంది ఇండస్ట్రీ లోకి వచ్చే హీరోయిన్లకు వెనకాల వాళ్ళ తల్లి లేక తండ్రి లేదా ఇంకెవరైనా కుటుంబ సభ్యుల హస్తం ఉంటుంది.ఇక ఇండస్ట్రీకి పరిచయం ఉన్నవాళ్ల హీరో హీరోయిన్ల వారసత్వం నిర్మాతలు దర్శకుల వారసత్వం కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తల్లిదండ్రులనే ఫాలో అవుతూ ఉంటారు చాలామంది.కానీ జాన్వీ కపూర్ మాత్రం కాస్త డిఫరెంట్.జాన్వీ సినిమాల విషయంలో తండ్రిని కాదు మరో వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తుందట.


ఏ విషయంలోనైనా సరే ఆయన సలహాలు తీసుకొనే ఇండస్ట్రీలో ఓ అడుగు ముందుకు వేస్తుందట.మరి ఇంతకీ జాన్వీ కపూర్ తండ్రిని కాదని ఎవరి సలహాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ స్టార్ నిర్మాత అయినటువంటి బోనీ కపూర్ దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈమె బాలీవుడ్లో మొదటి సినిమా చేసినప్పటికీ అంత గుర్తింపు అయితే రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేసిన పాన్ ఇండియా మూవీ దేవరపైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈ సినిమా హిట్ అయితే మాత్రం జాన్వీ కపూర్ కి సౌత్ లో తిరుగుండదు.. అయితే ఈ సినిమాలో మొదట జాన్వీ కపూర్ కి అవకాశం వచ్చినప్పుడు తండ్రికి చెప్పాక మరో వ్యక్తి సలహాలు తీసుకుందట. ఇక ఆయన ఎవరో కాదు బాలీవుడ్ దర్శకుడు.. నటుడు.. నిర్మాత.. అయినటువంటి కరణ్ జోహార్. అయితే బీటౌన్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జాన్వీ కపూర్ తనకి మొదట దేవర సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాన్ని కరణ్ జోహార్ కి చెప్పిందట.

దాంతో ఆ సినిమాలో హీరో ఎవరు అని అడగ్గానే ఎన్టీఆర్ పేరు చెప్పడంతో మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేయ్. ఆ హీరోతో ఇండస్ట్రీలోకి అడుగు పెడితే కచ్చితంగా నువ్వు స్టార్ అయిపోయినట్టే అని భరోసా ఇచ్చారట. ఇక కరణ్ జోహార్ మాటలు విని దేవర సినిమాకి జాన్వీ కపూర్ ఓకే చెప్పిందట.అంతేకాకుండా రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చిన సమయంలో కూడా ముందుగా కరణ్ జోహార్ సలహా తీసుకొని ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సినిమాల విషయంలో తండ్రి సలహాలు కాకుండా కరణ్ జోహార్ సలహాలు తీసుకుంటున్న జాన్వీ కపూర్ కి ఇండస్ట్రీ లో ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news