Moviesహీరో సంపూర్ణేష్ బాబు.. సినీ ఇండస్ట్రీకి దూరం వెనుక ఇంత కథ...

హీరో సంపూర్ణేష్ బాబు.. సినీ ఇండస్ట్రీకి దూరం వెనుక ఇంత కథ ఉందా..?

ప్రస్తుతం ఉన్న సినీ ఇండస్ట్రీలలో పరిస్థితి ఎలా ఉందంటే అవకాశాలు రావడం చాలా అరుదైన విషయంగా మారిపోయింది..ముఖ్యంగా కొత్తగా వచ్చేవాళ్లు ఏదో ఒక స్పెషాలిటీని చూపిస్తే తప్ప ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించడం లేదు. అలా విభిన్నమైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరించిన హీరో సంపూర్ణేష్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మాణ సంస్థలో హృదయ కాలేయం సినిమా ద్వారా సంపూర్ణేష్ బాబు మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఇందులో విభిన్నమైన వేషాలతో ఎంతోమందిని కడుపుబ్బ నవ్వించారు సంపూర్ణేష్ బాబు. సినిమాలలో వచ్చే సన్నివేశాలను స్పూఫ్ గా తీసుకొని మరి కామెడీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలోనే ఎన్నో చిత్రాలలో నటించిన సంపూర్ణేష్ బాబు ఈమధ్య సడన్గా సిని ఇండస్ట్రీకి దూరమయ్యారు. అంతేకాకుండా సినిమాలు కూడా చేయడం లేదు.సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనిపించడం లేదు.

దీంతో పలు రకాల మీడియా ఛానల్స్ సంపూర్ణేష్ బాబు గురించి వెతకడం మొదలుపెట్టగా.. పలు విషయాలు తెలియజేశారు.చివరిసారిగా మార్టిన్ లూథర్ కింగ్ అనే చిత్రంలో మాత్రమే. ఆ తర్వాత మళ్లీ ఎక్కడ సంపూర్ణేష్ బాబు కనిపించడం లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. సంపూర్ణేష్ బాబు రెండు చిత్రాలలో నటించాడట. ఈ చిత్రాలు కూడ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సమయంలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. తన సొంత ఊరిలో పొలం పనులు చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారట.

తాను చేస్తున్న పనిలో వచ్చిన డబ్బులతో కొన్ని సేవ కార్యక్రమాలు కూడ చేస్తున్నట్లు సమాచారం. హీరో అయినప్పటికీ కూడ సాధారణ వ్యక్తుల జీవితాన్ని బతికేస్తున్నాడట సంపూర్ణేష్ బాబు. తానే సొంతంగా అన్ని పనులు చేసుకుంటున్నారట.అయితే ఈ విషయం విన్న అభిమానులైతే సంపూర్ణేష్ బాబుని మెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో మీలాంటి హీరోలు ఉండాలి రావాలి అంటూ తెలియజేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news