పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారుండరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. తనదైన ప్రతిభతో హీరోగా నిలదొక్కుకున్నాడు. భారీ స్టార్డమ్ సంపాదించుకున్నాడు. అన్నకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే యాక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందాడు. అటువంటి పవన్ కళ్యాణ్ తన తొలి సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.
డైరెక్టర్ అవ్వాలనుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి సతీమణి సురేఖ బలవంతం మేరకు యాక్టింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరపై అడుగుపెట్టాడు. ఇ. వి. వి. సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ హీరోయిన్ గా నటించింది. ఖయామత్ సే ఖయామత్ తక్ అనే హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ గా ఆడింది.
అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా.. కేవలం రూ. 50 వేలు. అవును మీరు విన్నది నిజమే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి పవన్ నెలవారీ జీతం అందుకున్నాడు. నెలకు రూ. 5 వేలు. అలా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యే సరికి రూ. 50 వేల వరకు వచ్చాయట.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరోలను మించి రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. గతంలో ఓ బహిరంగ సభలో రోజుకు తన రెమ్యునరేషన్ రూ. 2 కోట్లు అని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించడం విశేషం. కాగా, సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీరమల్లు వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ లో పవన్ బిజీ ఉండటం వల్ల ఆయా సినిమాలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. త్వరలో ఓజీ షూటింగ్ రీస్టార్ట్ కానుందని అంటున్నారు.