ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న అందరి నోటా ఒకే ఒక మాట ప్రధానంగా వినిపిస్తోంది. అదే జై బాలయ్య… జై జై బాలయ్య. నందమూరి నటి సింహం బాలకృష్ణ సినిమా రంగంలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో అట్టహాసంగా బాలయ్య 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ ఉత్సవ వేడుక నిర్వహించారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు మీడియాతో పాటు తెలుగు సోషల్ మీడియా ఎక్కడ చూసినా బాలయ్య నామస్మరణ వినిపిస్తోంది. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ ప్రతి ఒక్క సినీ అభిమాని నినాదాన్ని హోరెత్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య గురించి ఆయన అనుభవాలు… పోలీస్ సంచలన విషయాలు సోషల్ మీడియాలో ప్రముఖంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య తన గురించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికకు బాలయ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి.. అనుభవాలతో పాఠాలు నేర్చుకోవాలి అన్నదే ఎన్టీఆర్ సిద్ధాంతం అని.. అందుకే ఎన్టీఆర్ నన్ను వేలుపెట్టి నడిపించినట్టుగా నిలబెట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు.
నేను సోలోగా నటించిన సినిమాల విషయంలో ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోలేదు.. మొదట్లో కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.. దీంతో ఇండస్ట్రీలో బాలకృష్ణ పని అయిపోయిందన్న విమర్శలు ఎక్కువగా వినిపించాయి.. కొందరు అయితే తండ్రికి తగ్గ తనయుడు బాలయ్య అస్సలు కాదని అన్నారు. ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయని.. ఆ టైంలోనే మంగమ్మగారి మనవడు సినిమా వచ్చి సంచలనం సృష్టించిందని… అదే టైంలో నాన్నగారు సీఎంగా ఉన్నారు… ఆ సినిమాలో రాముడు, కృష్ణుడు గెటప్ లు వేస్తున్నానని తెలిసి నాన్నగారు పర్సనల్ మేకప్ మ్యేన్ని పంపి జాగ్రత్తగా చేయమని పదేపదే చెప్పారని బాలయ్య గుర్తు చేసుకున్నారు.
పౌరాణిక పాత్రలంటే ఆయనకు ఎంతో అభిమానం.. గౌరవం అని బాలయ్య తెలిపారు. మంగమ్మగారి మనవడు సినిమా విడుదలయ్యాక హైదరాబాదులో 565 రోజులు ఆడి రికార్డు సృష్టించిందని.. ఒకప్పుడు నవ్విన వాళ్లే ఆ సినిమా చూసి అద్భుతం అన్నారని బాలయ్య తెలిపారు.