టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో.. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించిన సినిమా దేవర. మరో రెండు రోజుల్లో దేవర సినిమా ధియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమాలో అధిక భాగం యాక్షన్ ఎపిసోడ్లు సముద్రం మీదనే ఉంటాయి. అందుకోసం సిజి పనులకు చాలా అంటే చాలా ఖర్చుతో పాటు.. చాలా టైం పట్టింది. సినిమా ప్రారంభిస్తూనే సీజీ షాట్లు తీసేసి మిగిలిన పనులు చూసుకున్నారు. దీనివల్ల వర్కింగ్ డేస్ కూడా చాలా అయ్యాయి. మామూలుగా నిర్మించే భారీ సినిమాలకు డబుల్ వర్కింగ్ డేస్ దేవర సినిమా కోసం అయ్యాయి.
సినిమా పాన్ ఇండియా సినిమాగా వస్తూ ఉండటం.. సినిమాలో పాన్ ఇండియా తారాగణం ఉండటం, టెక్నికల్ కాస్టింగ్ కూడా భారీగా ఉండడంతో రెమ్యూనరేషన్ గట్టిగా అయ్యాయి. దేవర తొలి భాగం నిర్మాణ వ్యయం రూ.400 కోట్ల వరకు అయ్యిందని తెలుస్తోంది. హిందీ వర్షన్ విడుదలకు ఇచ్చేశారు. మిగిలిన థియేటర్ హక్కుల రూపంలో రూ.180 కోట్ల వరకు వచ్చింది. నాన్ థియేటర్లో ఓటీటీ, ఆడియో ఇతర మార్గాల ద్వారా రూ.170 కోట్ల వరకు వచ్చింది. ఇంకా శాటిలైట్ కావాల్సి ఉంది.
అంటే రూ.400 కోట్ల పెట్టుబడికి.. రూ.350 కోట్ల వరకు రికవరీ వచ్చేసింది. శాటిలైట్ హక్కులు కూడా అమ్మాల్సి ఉండడంతో.. దేవర బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వెళ్తాడు. ఇక ఇప్పుడు హిందీ వెర్షన్ బాగా ఆడాల్సి ఉంది. హిందీ వర్షన్ బాగా ఆడితే దేవర లాభాలు కళ్ళ చూస్తారు. జాన్వీ కపూర్ ఉండటం.. సైఫ్ అలీ ఖాన్ విలన్ కావటం.. మరో సీనియర్ హీరో బాబి డియోల్ కూడా ఉండటం త్రిబుల్ ఆర్ తర్వాత.. ఎన్టీఆర్ నార్త్ బెల్ట్‌లో కూడా పరిచయం కావడంతో.. మంచి కలెక్షన్లు వస్తాయని ఆశిస్తున్నారు. దేవర హిందీ జనాలకు కనెక్ట్ అయితే లాభాలు భారీగా కళ్ళ చూసే అవకాశం ఉంది.