Moviesమ‌రోసారి త‌ల్లైన హీరోయిన్ ప్ర‌ణీత‌.. బేబీ ఫ‌స్ట్ పిక్ వైర‌ల్‌..!

మ‌రోసారి త‌ల్లైన హీరోయిన్ ప్ర‌ణీత‌.. బేబీ ఫ‌స్ట్ పిక్ వైర‌ల్‌..!

ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి తల్లి అయ్యింది. తాజాగా ఆమె తన రెండో బిడ్డకు వెల్కమ్ చెప్పింది. 2021 మే 30న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2022లో ఓ అందమైన కూతురు జన్మించింది. పాప పుట్టిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. కన్నడలో పలు చిత్రాల్లో నటిస్తోంది.

అయితే ఇంతలోనే మరోసారి ప్రణీత గర్భం దాల్చింది. ఇటీవల ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా ప్రణీత అందరితో పంచుకుంది. అలాగే ఆమె బేబీ షవర్ వేడుక కూడా చాలా ఘనంగా జరిగింది. తాజాగా ప్రణీత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బేబీ ఫస్ట్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రణీత తో పాటు ఆమె కొడుకు మరియు భ‌ర్త‌ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మార‌డంతో.. అభిమానులు, నెటిజ‌న్లు, కోస్టార్స్ ప్ర‌ణీత దంప‌తుల‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా, బెంగళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించిన ప్రణీత.. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. పోర్కి(పోకిరి రీమేక్‌) అనే క‌న్న‌డ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే బిగ్ హిట్ ను అందుకుంది. అన‌తి కాలంలో క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో స్టార్ స్టేట‌స్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లాడో, బావ‌, అత్తారింటికి దారేది, ర‌భ‌స త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. తమిళ్, హిందీ, మలయాళం భాషల్లోనూ యాక్ట్ చేసిన ప్రణీత‌.. మరోవైపు వ్యాపార‌రంగంలో సైతం దూసుకుపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news