యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే గురువారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచే దేవర ప్రీమియర్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో పడిపోనున్నాయి. ఇక సినిమా పిచ్చి.. సినిమా హంగామా ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలో అయితే దాదాపు అన్ని సెంటర్లలో దేవర ప్రీమియర్ షోలు పడిపోనున్నాయి. ఏ, బీ సెంటర్ల కంటే సీ సెంటర్లలో హంగామా మామూలుగా లేదు. అప్పుడే దేవర ఫీవర్ పట్టేసుకుంది. ఇక ఐదున్నర సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా తెరమీద కనిపిస్తూ ఉండడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హంగామాకు హద్దే ఉండటం లేదు.
ఇదే పశ్చిమగోదావరి జిల్లాలోని మరో సి సెంటర్ కామవరపుకోటలో తొలిరోజు అర్ధరాత్రి షోను మరో ఎన్టీఆర్ వీరాభిమాని వుయ్యూరు జగదీష్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు. ఇక్కడ ముందు రోజు రాత్రి నుంచే డీజే డ్యాన్సులు.. హంగామాతో పాటు భారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోనున్నారు. ఇప్పటికే 25 అడుగుల దేవర కటౌట్ వుయ్యూరు జగదీష్ ఏర్పాటు చేశారు. అటు భీమడోలుతో పాటు నల్లజర్ల శ్రీలక్ష్మీ మల్టీఫ్లెక్స్‌లో కూడా అర్ధరాత్రి షోలు ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమైపోయారు.