ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో ఈ షో 7 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఆదివారం హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిలో ఎక్కువ శాతం మంది సీరియల్ ఆర్టిస్టులు ఉండగా.. మరికొందరు సినీ నటులు, యాంకర్స్, యూటూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ తమ స్టేటజీలతో గేమ్ ను స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ సీజన్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ గా పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ నిలిచిందని ప్రచారం జరుగుతోంది. ఒక్కో వారానికి విష్ణు ప్రియ రూ. 4 లక్షలు పారితోషికం అందుకోబోతోందని అంటున్నారు.
విష్ణు ప్రియ తర్వాత హైయెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో ఫేమస్ అయిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆదిత్య ఓం.. వారానికి రూ. 3 లక్షలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట. అలాగే సీరియల్ నటి యష్మి గౌడ, టీవీ నటుడు నిఖిల్, ఆర్జే శేఖర్ బాషాలు వారానికి రూ. 2.50 లక్షలు చొప్పున పారితోషికం తీసుకోనున్నారు.
డ్యాన్సర్ నైనికకు బిగ్ బాస్ నిర్వహాకులు రూ.2.20లక్షలు చల్లిస్తున్నారు. సినీ నటుడు అభయ్ నవీన్, టీవీ నటి ప్రేరణ, సినీ నటి మరియు యూట్యూబర్ కిర్రాక్ సీత, యూట్యూబర్ నబీల్ ఆఫ్రిదిలకు రూ. 2 లక్షలు చొప్పున రెమ్యునరేషన్ అందిస్తున్నారు. ఇక యూట్యూబర్ బెజవాడ బేబక్క, సినీ నటి సోనియా ఆకుల, టీవీ నటుడు పృథ్విరాజ్ వారానికి రూ. 1.5 లక్షలు ఛార్జ్ చేస్తుండగా.. మోడల్ కమ్ యాక్టర్ నాగ మణికంఠకు రూ. 1.20 లక్షలు ఇస్తున్నారట.