Moviesరామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఏకైక సినిమా...

రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చ‌ర‌ణ్‌.. చిరుత‌ సినిమాతో హీరోగా మారాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌గ‌ధీర‌తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి హీరోగా నిల‌దొక్కుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. భారీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌న‌దైన ప్ర‌తిభ‌తో అంచెలంచెలుగా ఎదిగాడు. న‌టుడిగా త‌న‌ను తాను మెరుగుప‌రుచుకుంటూ గ్లోబ‌ర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. తండ్రిని మించిన త‌న‌యుడిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు.

ప్ర‌స్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ బిజీ యాక్ట‌ర్ గా స‌త్తా చాటుతున్నాడు. అటువంటి రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఏకైక సినిమా ఏదో తెలుసా.. మెరుపు. ఆరెంజ్ సెట్స్ మీద ఉండ‌గా మెరుపు ప్రాజెక్ట్ కు రామ్ చ‌ర‌ణ్ సంత‌కం చేశాడు. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ స్టోరీ ఉంటుంది. బంగారం ఫేమ్ ధ‌ర‌ణి ద‌ర్శ‌కుడు కాగా.. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయింది.

మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మెరుపు గ్రాండ్ గా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. కొద్ది రోజులు షూటింగ్ కూడా జ‌రిగింది. కానీ ఆర్థిక స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ధ్య‌లోనే మెరుపు మూవీ అట‌కెక్కింది. ఈ చిత్రానికి తొలుత అనుకున్న బడ్జెట్ చాలా తక్కువ. కానీ ఆ త‌ర్వాత‌ బడ్జెట్ ని కంట్రోల్ చేయ‌డంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫెయిల్ అయ్యారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సరికొత్త లవ్ స్టోరీతో రూపొందించిన ఆరెంజ్ మూవీ ఓవర్ బడ్జెట్ వల్ల డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆరెంజ్ ప్ర‌భావం మెరుపుపై గట్టిగా ప‌డింది.

ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మెరుపు చిత్రాన్ని పూర్తి చేసేందుకు ముంద‌డుగు వేయ‌లేక‌పోయాడు. మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమాను ఆపేయ‌మ‌ని సూచించారు. అలా ఫైనాన్షియల్ ఇష్యూస్ కార‌ణంగా రామ్ చ‌ర‌ణ్ మెరుపు మూవీ షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. ఇక ఆ త‌ర్వాత నుంచి ఇప్ప‌టివ‌రకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో సినిమా చేసే అవ‌కాశం రామ్ చ‌ర‌ణ్ కు రాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news