Moviesబిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సీరియ‌ల్‌ న‌టి ర‌ష్మిక‌కు...

బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సీరియ‌ల్‌ న‌టి ర‌ష్మిక‌కు క్లోజ్ ఫ్రెండ్ అని తెలుసా?

తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ సీజ‌న్ కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ ఏడు జంట‌లుగా మారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. యష్మీ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, యాంకర్ విష్ణు ప్రియ, నైనిక, నబీల్ ఆఫ్రీది కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్నారు.

గ‌త సీజ‌న్స్ మాదిరిగానే ఈ సీజ‌న్ లోనూ సీరియల్ బ్యాచ్ హడావిడి ఎక్కువగా క‌నిపిస్తోంది. బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన సీరియ‌ల్ ఆర్టిస్ట్స్ లో ప్రేర‌ణ కంభం ఒక‌రు. 1996 జూన్ 18లో జన్మించిన ప్రేరణ తెలంగాణాలోని హైదరాబాద్‌కి చెందిన అమ్మాయి. హర హర మహాదేవ్ అనే సీరియల్‌తో కన్నడ టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ప‌లు ప్ర‌ముఖ సీరియ‌ల్స్, సినిమాల్లో యాక్ట్ చేసింది. తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా చాలా పాపుల‌ర్ అయింది. త‌న అమాయ‌క‌పు న‌ట‌న‌, చిలిపి అల్ల‌రితో తెలుగువారి హృద‌యాలు దోచుకుంది.

2021 బిగ్ బాస్ కన్నడ మినీ-సీజన్‌ కంటెస్టెంట్‌లలో ప్రేరణ‌ ఒకరు. ఈ అందాల భామకు ఎనిమిది నెల‌ల క్రిత‌మే వివాహం జ‌రిగింది. శ్రీపాద్ దేశ్‌పాండేని ప్రేర‌ణ ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది. మ‌రొక ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నాకు ప్రేర‌ణ క్లోజ్ ఫ్రెండ్‌. ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారట‌. అడిషన్స్ కోసం పెద్ద లగేజీ పట్టుకుని క‌లిసే వెళ్లేవారట‌. అలాగే ర‌ష్మిక‌, ప్రేర‌ణ అర్దరాత్రిళ్లు స్కూటీపై తిరిగిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయ‌ట‌. బిగ్ బాస్ సీజ‌న్ 8 ప్రారంభోత్స‌వం నాడు స్టేజ్‌పై ప్రేరణ స్వ‌యంగా ఈ విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది. దీంతో ర‌ష్మిక ఫ్యాన్స్ కూడా ఆమెకు స‌పోర్ట్ చేసే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news