Moviesర‌కుల్ రిజెక్ట్ చేసిన బాల‌కృష్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా..?

ర‌కుల్ రిజెక్ట్ చేసిన బాల‌కృష్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా..?

టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుని బాలీవుడ్ కు మ‌కాం మార్చిన ముద్దుగుమ్మ‌ల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌టి. అయితే నార్త్ లో స్టార్ హోదా అందుకోవాల‌ని ర‌కుల్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. స‌క్సెస్ ఆమెకు ఆమ‌డ దూరంలో ఉంటోంది. పైగా బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యాక తెలుగులో చాలా మంచి చిత్రాల‌ను ర‌కుల్ రిజెక్ట్ చేసింది. ఈ లిస్ట్ లో బాల‌కృష్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కూడా ఉంది. ఇంత‌కీ బాల‌కృష్ణ‌, ర‌కుల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన ఆ సినిమా మ‌రేదో కాదు అఖండ‌.

బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన ఈ యాక్ష‌న్ డ్రామాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా న‌టించ‌గా.. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీకాంత్, నితిన్ మెహతా, పూర్ణ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన అఖండ మూవీ 2021లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.

రూ. 60 బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన అఖండ‌.. ఫుల్ ర‌న్ లో రూ. 150 కోట్ల రేంజ్ లో క‌లెక్ష‌న్స్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఈ సినిమా 103 సెంటర్లలో 50 రోజుల ర‌న్ ను పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. అలాగే వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న బాల‌కృష్ణ‌.. అఖండ‌తో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇక‌పోతే ఈ చిత్రంలో బాల‌కృష్ణ భార్య‌గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్రలో ప్ర‌గ్యా న‌టించింది.

త‌న‌దైన అందం, అభిన‌యంతో ఆమె అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. అయితే హీరోయిన్ క్యారెక్ట‌ర్ కు ప్ర‌గ్యా ఫ‌స్ట్ ఛాయిస్ కాదు. డైరెక్ట‌ర్ బోయ‌పాటి మొద‌ట ర‌కుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకోవాల‌ని భావించార‌ట‌. కానీ బాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఆమె నో చెప్పింది. ఆ త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ ను సంప్ర‌దించ‌గా.. ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ తో ఆమె కూడా రిజెక్ట్ చేసింది. దాంతో బోయ‌పాటి మ‌రో ఆలోచ‌న లేకుండా ప్ర‌గ్యాను ఎంపిక చేశార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news