Moviesదేవ‌ర ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌... రికార్డుల జాత‌ర‌తో పాత‌రేసిన ఎన్టీఆర్‌...!

దేవ‌ర ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌… రికార్డుల జాత‌ర‌తో పాత‌రేసిన ఎన్టీఆర్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. గురువారం అర్ధ‌రాత్రి నుంచే వ‌ర‌ల్డ్ వైడ్‌గా దేవ‌ర సినిమాకు ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోయాయి. ఇక తొలి రోజు దేవ‌ర‌పై ఉన్న హై అంచ‌నాల‌తో ఏకంగా రు. 172 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో వ‌రుస‌గా రెండోసారి ద‌క్కిన రికార్డ్‌.

Devara: Part - 1 Movie Review: Jr NTR shines in a visually stunning yet  predictable action drama

త్రిబుల్ ఆర్ కూడా ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏకంగా రు. 223 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక రెండు రోజుల‌కు క‌లిపి రు. 243 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించిన దేవ‌ర‌.. మూడు రోజుల‌కు అంటే ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకు రు. 304 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇది ఎన్టీఆర్ సినీ కెరియర్లోనే హయ్యస్ట్ ఫస్ట్ వీక్ రికార్డ్ నమోదు చేసింది.

Devara Second Single Release Date And Time Revealed: Jr. NTR's Movie Song  Coming Soon - Filmibeat

పాత రికార్డులు బ్రేక్ చేయ‌డ‌మే కాదు.. కొత్త రికార్డులు కూడా దేవ‌ర దెబ్బ‌కు బ్రేక్ అయిపోతున్నాయి. ఫ‌స్ట్ డే రు. 172 కోట్లు.. ఫ‌స్ట్ వీకెండ్‌కు రు. 304 కోట్ల గ్రాస్ అంటే అదో సంచ‌ల‌న‌మే అనుకోవాలి. ఇక ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే దేవ‌ర వ‌సూళ్లు రు. 400 కోట్లు దాటేసి.. రు. 450 కోట్ల వైపు ప‌రుగులు పెడ‌తాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news