ఆర్ఆర్ఆర్ విడుదలైన దాదాపు రెండేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ థియేటర్స్ లో సందడి చేయబోతున్నారు. `దేవర చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన దేవర సినిమాకు కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన దేవర రెండు భాగాలుగా రాబోతోంది. పార్ట్ 1 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరిగింది. దేవర కళ్లు చెదిరే ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఏపీ మరియు తెలంగాణలో రూ. 112.55 కోట్లకు దేవర థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 182.25 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 184 కోట్ల రేంజ్ లో ఉంది. ఏరియాల వారీగా దేవర పార్ట్ 1 బిజినెస్ లెక్కలను పరిశీలిస్తే..
నైజాం: 44 కోట్లు
సీడెడ్: 22 కోట్లు
ఉత్తరాంధ్ర: 12.40 కోట్లు
తూర్పు: 7.75 కోట్లు
పశ్చిమ: 6.50 కోట్లు
గుంటూరు: 8.50 కోట్లు
కృష్ణ: 7.20 కోట్లు
నెల్లూరు: 4.20 కోట్లు
ఏపీ+తెలంగాణ= 112.55 కోట్లు
కర్ణాటక: 16 కోట్లు
తమిళనాడు: 6 కోట్లు
కేరళ: 1 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 20 కోట్లు