టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకునే విషయంలో కొంతవరకు తడబడింది. గురువారం అర్ధరాత్రి ప్రీమియర్ షోలు చూశాక అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. సినిమాకు మిక్స్డ్ టాక్ కూడా వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు మంచి వసూలు సాధించింది.
ఫ్రీ సేల్ బుకింగ్స్‌లోనే రికార్డులు సొంతం చేసుకున్న దేవర తొలి రోజు కలెక్షన్ల పరంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. భారతదేశ వ్యాప్తంగా రు. 77 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రు. 140 కోట్లు కొల్లగొట్టింది. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ – తెలంగాణ నుంచి రు. 68 కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఏడు కోట్లకు పైగా నెట్టు వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటించడం ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు.
యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక దేవర అంతంత మాత్రం టాక్ అని మాట్లాడిన వాళ్ల నోళ్లకు తారక్ తన కలెక్షన్లతో ప్లాస్టర్ వేశాడు.