టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గురువారం అర్ధరాత్రి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తొలి రోజు సినిమాకు ఉన్న హైప్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రు. 172 కోట్ల వసూళ్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే కలెక్షన్స్ అప్డేట్ చేసే బాక్స్ ఆఫీస్ పోర్టల్స్ కొన్ని 140 కోట్ల రూపాయల మాత్రమే వచ్చాయని తెలిపాయి. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రు. 185 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక రెండో రోజు కూడా దేవర బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే మిక్స్ డ్ టాక్‌తో.. గొప్పగా లేని రివ్యూలతో కూడా దేవర అదర గొట్టేసింది. రెండో రోజు కూడా దేవర దుమ్ము రేపింది. రెండు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా దేవర సినిమాకు రు. 243 కోట్ల వసూళ్లు వచ్చినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. రెండు రోజులకు కలిపి దాదాపు రు. 130 కోట్ల రేంజ్‌లో షేర్ వచ్చేసింది. అంటే మరో రు. 60 కోట్ల షేర్ వస్తే చాలు దేవర బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.
ఆదివారంతో పాటు ఆ తర్వాత దసరా సెలవులు వస్తుండడంతో దేవర సులువుగా బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పాటు భారీ లాభాలు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఎన్టీఆర్ విశ్వరూపం ఎన్ని కోట్ల వరకు వెళ్లి ఆగుతుందో ? చూడాలి.