Moviesప‌వ‌న్ అంటే బ‌న్నీకి అస్స‌లు ఇష్టం లేదా.. మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకున్నాడుగా..!

ప‌వ‌న్ అంటే బ‌న్నీకి అస్స‌లు ఇష్టం లేదా.. మ‌రోసారి బ‌య‌ట‌పెట్టుకున్నాడుగా..!

జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు.. పలువురు రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్‌గా.. వివిధ రూపాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇటు తెలుగు సినిమా రంగంలోని ప్రతి ఒక్కరు.. అటు ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ ఉపముఖ్యమంత్రిగా ఉండడంతో.. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలు పార్టీలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ పై తమ ప్రత్యేక అభిమానం చాటుకున్నారు.

సోషల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్ ఫోటోలతో హోరెత్తిపోయింది. ఇందులో భాగంగా టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు సహజంగానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాస్తవంగా కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్‌కు అల్లు అర్జున్‌కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. గత 20 రోజులుగా తెలుగు మీడియాలోను.. తెలుగు సోషల్ మీడియాలోనూ.. ఎక్కడ చూసినా దీని గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది.

బన్నీ తనకు ఇష్టమైన చోటికి వెళ్తానని కామెంట్ చేసి.. పరోక్షంగా పవన్ కు తన ఉద్దేశాన్ని వెల్లడించినట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు బెంగళూరు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి ఘాటు కామెంట్స్ చేశారన్న ప్రచారమూ ఉంది. ఇప్పుడు సినిమాల్లో ఎర్రచందనం స్మగ్లర్లు హీరోలు అవుతున్నారని పవన్ అన్న సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గానే బన్నీ కూడా తనకు ఇష్టమైన చోటకే వెళ్తా అన్న కామెంట్లు చేశారన్న ప్రచారము ఉంది. అలాంటి టైంలో బన్నీ.. పవన్ పుట్టినరోజు కనుక చాలా సింపుల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని సింపుల్ గా సరిపెట్టేశారు. బన్నీ మెసేజ్ చూస్తే కేవలం మర్యాద కోసమే బర్త్ డే శుభాకాంక్షలు చెప్పినట్టు ఉందే తప్ప.. అది కూడా మొహమాటానికి పోయి చెప్పాడు తప్ప.. పవన్ కళ్యాణ్ పై నిజమైన ప్రేమ ఉందా అంటే.. కచ్చితంగా లేదనే అన్న చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఎప్పటిలో పవన్ కళ్యాణ్.. బన్నీ వార్‌కు తెరపడే సూచనలు అయితే లేవు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news