గత ఆదివారం ఎంతో అట్టహాసంగా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. మరోసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తుండగా.. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడుతూ ఇంటిని హీటెక్కిస్తున్నారు. రెండు రోజులపాటు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇక చూస్తుండగానే వీకెండ్ కూడా వచ్చేసింది.
శనివారం నాడు హోస్ట్ నాగార్జున వచ్చి సందడి చేశారు. పలువురు కంటెస్టెంట్స్ కు తనదైన శైలిలో క్లాస్ పీకారు. నేడు సండే అంటే ఫన్ డే. అలాగే ఎలిమినేషన్ డే కూడా. తొలివారం నామినేషన్స్‌లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు ప్రియ, సోనియా, బెజవాడ బేబక్క, మణికంఠ, పృథ్వీశెట్టి నామినేట్ అవ్వగా.. ఓటింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.
అయితే ఓటింగ్ లో మణికంఠ దూసుకుపోయాడు. సింపథీ గేమ్ ఆడుతున్నాడని మొదట అతన్ని విమర్శించినా.. జనం మాత్రం మణికంఠకే ఓట్లు గుద్దేశారు. మెజారిటీ పోలింగ్స్ లో మణికంఠనే అత్యధిక ఓటింగ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ ఉండగా.. పృథ్వీ, సోనియా ఆకుల, శేఖర్ బాషా కూడా మంచి ఓటింగ్ సంపాదించుకున్నారు. మిగిలింది బేబక్క.
తొలి వారం ఆమె పర్ఫామెన్స్ అంతంత మాత్రమే. పైగా కిచెన్ లో లేటుగా వంట చేయడం వల్ల లేని పోని గొడవలకు కారణమవుతోంది. హౌస్‌లో ఆమె ప్రవర్తన కూడా కాస్తా అతిగా అనిపించడంతో.. బిగ్ బాస్ వీక్షకులకు బేబక్కకు ఓట్లు వేసేందుకు వెనకడుగు వేశారు. అందువల్ల తొలి వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ బేబక్కనే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.