Moviesబిగ్ బాస్ 8.. ఓటింగ్ లో వెన‌క‌ప‌డ్డ స్ట్రోంగ్ కంటెస్టెంట్‌.. ఎలిమినేట్...

బిగ్ బాస్ 8.. ఓటింగ్ లో వెన‌క‌ప‌డ్డ స్ట్రోంగ్ కంటెస్టెంట్‌.. ఎలిమినేట్ అవ్వ‌డం ఖాయ‌మేనా?

తెలుగు టెలివిజన్ పై మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటికే 7 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాగా.. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. సీజన్ 8 లో తొలివారం పూర్తి కాగా.. బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది.

రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ ఎంతో రసవత్తరంగా సాగింది. ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో నాగ మణికంఠ పృథ్వీరాజ్, నైనిక, కిర్రాక్ సీత, శేఖర్ భాష, సీరియల్ నటుడు నిఖిల్, యాంకర్ విష్ణు ప్రియ, ఆదిత్య ఓం ఉన్నారు. వీరిలో నిఖిల్ హైయెస్ట్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత విష్ణు ప్రియ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ మంచి ఓటింగ్ ను సంపాదించుకుంటున్నారు.

ఓటింగ్ ప‌రంగా వీరి తర్వాతి స్థానాల్లో నైనిక, ఆదిత్య, శేఖర్ బాష నిలిచారు. ఇక తొలి రోజు నుంచి స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్న కిర్రాక్ సీత ఓటింగ్ లో వెనకబడింది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడమే కాకుండా పాయింట్ టు పాయింట్‌ కరెక్ట్ గా మాట్లాడుతూ సీత ప్రేక్షకులకు చేరువైంది. కానీ స‌రైన పిఆర్ టీం లేకపోవడం వల్ల సీతకు ఓట్లు సరిగ్గా రావడంలేదని అంటున్నారు.

ఓటింగ్ లో సీత పుంజుకోకపోతే రెండో వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయమని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒకవేళ సీత సేఫ్ అయ్యిందంటే శేఖర్ భాష డేంజర్ జోన్ లో పడొచ్చు. మరి శేఖర్ బాషా మరియు సీతలో రెండో వారం బ్యాగ్ స‌ద్దేసేది ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news