Moviesతొలి వార‌మే బ్యాగ్ స‌ద్దేసిన‌ బేబ‌క్క.. ఇంత‌కీ బిగ్ బాస్ నుంచి...

తొలి వార‌మే బ్యాగ్ స‌ద్దేసిన‌ బేబ‌క్క.. ఇంత‌కీ బిగ్ బాస్ నుంచి ఎంత సంపాదించింది..?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 ఫ‌స్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. ఎంట‌ర్టైన్మెంట్ లేక‌పోయినా గొడ‌వులు, ఏడుపుల‌తో కంటెస్టెంట్స్ షోను బాగానే ర‌క్తిక‌ట్టించారు. శ‌ని, ఆదివారాలు హోస్ట్ నాగార్జున వ‌చ్చి సంద‌డి చేశాడు. సండే ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ కూడా జ‌రిగింది. తొలి వారం నామినేష‌న్స్ లో నాగ మణికంఠ, సోనియా, బెజ‌వాడ బేబ‌క్క‌, విష్ణుప్రియ, పృథ్వి, శేఖర్ భాష ఉన్నారు. అయితే వీరిలో బేబ‌క్క ఎలిమినేట్ అవుతుంద‌ని ముందే పోల్స్ తేల్చాయి.

ఊహించిన‌ట్లే బేబ‌క్క బ్యాగ్ స‌ద్దేసింది. ఫస్ట్ వీక్ మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యే సంప్రదాయం ఈ 8వ సీజన్‍లోనూ కొనసాగింది. బెజ‌వాడ‌ బేబక్క అస‌లు పేరు మ‌ధూ నెక్కంటి. సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న బేబ‌క్క‌..కామెడీ రీల్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది. ఆ పాపుల‌రిటీనే ఆమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ తెచ్చిపెట్టింది. అయితే తానేంటో ఇంకా ఫ్రూవ్ చేసుకోకముందే బేబ‌క్క ఇంటి బాట ప‌ట్టింది.

ఇక వారం రోజులు హౌస్ లో ఉన్న బేబ‌క్క బిగ్ బాస్ నుంచి ఎంత సంపాదించిందో తెలుసుకునేందుకు అంద‌రూ ఉత్సాహం చూపుతున్నారు. సోష‌ల్ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. వ‌న్ వీక్ ఉన్నందుకు గానూ బేబ‌క్కకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు రూ. 1.30 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. ఇది పెద్ద అమౌంట్ కాక‌పోయినా.. బిగ్ బాస్ కు వెళ్లాక మాత్రం సోష‌ల్ మీడియాలో బేబ‌క్కకు ఫాలోవ‌ర్స్ భారీగా పెరిగిపోయారు. కాగా, ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మ‌రి వీరిలో రెండో వారం ఇంటి బాట ప‌ట్టేది ఎవ‌రో తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news