Moviesఆ క్రేజీ స్టార్ హీరోతో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ ఫిక్స్‌...!

ఆ క్రేజీ స్టార్ హీరోతో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ ఫిక్స్‌…!

న‌ట‌సింహం బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. ఫ‌స్ట్ సీజ‌న్‌.. రెండో సీజ‌న్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ద‌స‌రా కానుక‌గా మూడో సీజ‌న్ కూడా తీసుకు రాబోతున్నారు. మూడో సీజ‌న్ కూడా సూప‌ర్ హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూడో సీజ‌న్‌కు మంచి గెస్టుల‌ను తీసుకురావ‌డం ఇప్పుడు క‌త్తిమీద సాములా మారింది. టాప్ గెస్టులు.. టాప్ హీరోలు వ‌స్తే త‌ప్పా షోకు కిక్ ఉండ‌దు.Lucky Baskhar Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimesఅయితే తాజాగా ఈ టాక్ షో గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. ఓ యంగ్ క్రేజీ హీరోను ఈ షోకు తీసుకు వ‌స్తున్నార‌ట‌. ఈ హీరో ఎవ‌రో కాదు. దుల్క‌ర్ స‌ల్మాన్‌. దుల్క‌ర్ త‌న ల‌క్కీ భాస్క‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా అన్‌స్టాప‌బుల్ షోకు రావ‌డం.. ఎపిసోడ్ షూట్ చేయ‌డం కూడా జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో దుల్కర్ సల్మాన్ తో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి.. నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నార‌ని అంటున్నారు.Balakrishna demanding more than 5 crores for Unstoppable 2ఇక బాల‌య్య వీరితో చాలా స‌ర‌దాగా ముచ్చ‌టించ‌డంతో పాటు మంచి ప్ర‌శ్న‌లు వేసి షోను ర‌క్తిక‌ట్టించాడ‌ని తెలుస్తోంది. ఇక బాల‌య్య వీరికి ఎలాంటి ఇంట్ర‌స్టింగ్ ప్ర‌శ్న‌లు వేసి.. వారి నుంచి ఎలాంటి ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు రాబ‌ట్టాడు ? అనేది ఎపిసోడ్‌లోనే చూడాలి. లక్కీ భాస్కర్ సినిమా విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news