Moviesనంద‌మూరి మోక్షజ్ఞ సినిమాలో మ‌రో స్టార్ హీరో… ఫ్యాన్స్‌కు పూన‌కాలు లోడింగ్‌..!

నంద‌మూరి మోక్షజ్ఞ సినిమాలో మ‌రో స్టార్ హీరో… ఫ్యాన్స్‌కు పూన‌కాలు లోడింగ్‌..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఈరోజు హైదరాబాదులో వైభవంగా జరగనున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు నందమూరి అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా ? అని ఐదు ఆరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమైంది.

హనుమాన్ లాంటి సినిమాను తెర‌కెక్కించిన యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ‌ తొలి సినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య ముఖ్య పాత్రలో కనిపించనున్నారన్న వార్త నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి. ఈ సినిమా కథ మైథాలజికల్ టచ్.. సోషియాఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమాకు మోక్ష పుట్టిన రోజు కానుక‌గా సెప్టెంబర్ 6న ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది.

నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు.. అన్నది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కానీ.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని, బాలయ్య చిన్నల్లుడు విశాఖ ఎంపీ అయిన శ్రీ భరత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. అలాగే దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ పేరు కూడా లైన్ లో ఉంది. ఏది ఏమైనా త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news