అతడు ఓ డ్యాన్స్ మాస్టర్.. అనుకోకుండా దర్శకుడు అయ్యాడు. ఆ తర్వాత హీరో కూడా అయ్యాడు.. అతడు కెరీర్లో హిట్లు ఉన్నాయి.. ప్లాపులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం లెక్కలు చూసుకుంటే తెలుగులో అతడి సినిమాలకు పెద్దగా మార్కెట్ లేదు.. అతడి గురించి జనాలు పట్టించుకోవడం కూడా మానేశారు. ఇక గత కొన్ని నెలల్లో వచ్చిన అతడి సినిమాలు అయితే థియేటర్ల దగ్గర అద్దెలు కూడా రాబట్టలేదు. అయినా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నాడట. రేటు విషయంలో తగ్గకుండా ఉండటం కాదు.. ఆ రేటు వింటే గుండె గుబెల్ మంటోందట. టాలీవుడ్ నిర్మాతలకి పోనీ అడిగినంత ఇచ్చి సినిమా మొదలు పెట్టాలని అనుకున్నా మళ్లీ టెక్నికల్ క్రూ – హీరోయిన్ ఇలా అన్ని విషయాలలోనూ అతడి సెలక్షన్ ఉంటుంది.
పోనీ అక్కడ తగ్గించుకుందాం అన్నా కుదరదు.. ఎందుకంటే ఇవాళ రేపు సినిమాకు హీరోయిన్ ముఖ్యం. సరైన హీరోయిన్ లేకుండా హిట్టు కొట్టడం కొంతమంది హీరోల వల్ల కూడా కావడం లేదు. అందమైన హీరోయిన్‌ను తెచ్చుకుని పాటలు.. డ్యాన్సులు చేయించుకుని హిట్ సినిమా ఖాతాలో వేసుకోవడం అన్నది హీరోలకు స్ట్రాటజీగా మారిపోయింది. అది వేరే సంగతి. అయితే మనం చెప్పుకున్న డ్యాన్స్ డైరెక్టర్ – హీరో – డైరెక్టర్ ఇప్పుడు ఒక్కో సినిమాకు అడుగుతున్నది 25 నుంచి 30 కోట్లు అని తెలుస్తోంది.
అతడు సినిమాకు తెలుగు థియేటర్ మార్కెట్ మొత్తం కలిపిన 5 కోట్లు ఉండదు.. కానీ దానికి 5 రెట్లు కావాలంటే ఏ నిర్మాత మాత్రం ధైర్యం చేస్తాడు.. రెండు భాషల్లో కలిపిన మహా అయితే మరో ఐదు కోట్లు ఉంటుంది.. అంటే ఆ మల్టీ టాలెంట్ హీరోకు రు. 100 కోట్లు ఇవ్వటమే ఎక్కువ.. అలాంటిది ఏకంగా రు. 25 నుంచి 30 కోట్లు డిమాండ్ చేయడం అంటే నిర్మాతలకు గుండె గుబేల్ మంటోంది. ఆ హీరో గారి డిమాండ్ ఎలా ఉన్నా ఏ నిర్మాత కూడా ఇప్పట్లో అతడు సినిమా తీసే సాహసం అయితే చెయ్యట్లేదు. అసలు తెలుగులో పాతిక కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో సినిమాకే నాన్ ధియేటర్ రు. 50 కోట్లు రావడం లేదు. అందులో సగం హీరోనే తీసేసుకుంటున్నారు. మరి ఈ సుందరాంగుడికి పాతికి కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇస్తారు.