పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా కొద్ది గంటల్లోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే గతంలో పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా నష్టాల వ్యవహారం ఇప్పుడు డబ్బులు ఇస్మార్ట్ మీద పడడంతో అసలు ఈ సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవుతుందా ? లేదా అన్నది కాస్త సస్పెన్స్ గా ఉంది. ఇదిగో అయిపోయింది.. అదిగో అయిపోయింది అంటున్నారే తప్ప ఇంకా ఈ పంచాయితీ తేలలేదని తెలుస్తోంది. చాలా రీజనబుల్ గా నైజాం ఎగ్జిబిటర్లు తమ నష్టాలను జస్ట్ 40% కవర్ చేస్తే చాలు అని ఒప్పుకున్నారట. దీంతో ఒప్పందం కుదరకపోవడంతో అసలు నైజాం బయ్యర్ ఎవరో ? ఇప్పటి వరకు తేలని పరిస్థితి. ఇక్కడ ఇండస్ట్రీ జనం రకరకాలుగా చీలిపోయారు.
ఛాంబర్ కౌన్సెల్ పెద్దలు అంతా పూరి ఛార్మి వైపు ఉన్నారు. హీరో రామ్ బంధువు అయిన స్రవంతి రవి కిషోర్ కూడా పూరి – ఛార్మి వైపే ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు బాధితులు అంత మరోవైపు ఉన్నారు. ఛార్మి నుంచి డబ్బులు రావాల్సినా తమను ఇప్పటివరకు ఛైర్మన్ సంప్రదించలేదని బయ్యర్లు చెబుతున్నట్టు సమాచారం. ఇక్కడ ఉన్న మరో లెక్క ఏంటంటే 40 శాతం నష్టాలు ఇస్తామని చెప్పారు.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అని మడత పేచీ పెట్టినట్టు తెలుస్తుంది. ఇది బయ్యారులకు ఇష్టం లేదు. ఇది ఇలా ఉంటే కీలకమైన నైజాంలో ఈ సినిమాను ఎవరు పంపిణీ చేస్తారో ? అన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదని తెలుస్తోంది.
నైజాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏషియన్ సురేష్ సంస్థకు ఇస్తారని టాక్ అయితే వినిపిస్తోంది.. కానీ నిజానికి అటు ఛార్మితో కానీ పూరితో కానీ మంచి సంబంధాలు ఉన్న మైత్రి సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తలకాయ నొప్పులు ఉండడంతో ఈ సినిమా పంపిణీ చేసేందుకు మైత్రి సంస్థ ముందుకు రాలేదని అంటున్నారు. ఇక ఏషియన్ సంస్థకి ఇస్తే నైజాంలో థియేటర్లకు ఇబ్బంది ఉండదు. సమస్య తేలే వరకు డబుల్ స్మార్ట్ రిలీజ్ పోస్టర్ పడుతుందా లేదా అన్నది పెద్ద సస్పెన్స్ గా అయితే ఉంది. మధ్యలో రిలీజ్ కు ఒక రోజు మాత్రమే ఉంది. మరి పంచాయితీ ఎప్పటికీ కొలిక్కి వస్తుందో ? థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఎప్పటికీ ఓపెన్ అవుతాయో చూడాలి.