ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు యూత్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఒకప్పుడు బన్నీ సినిమా వస్తుందంటే చాలు తెలుగుతో పాటు అటు మలయాళం లోను మంచి అంచనాలు ఉండేవి. అయితే పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయింది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వంద కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బన్నీ పుష్ప 2 సినిమా కోసం సౌత్ ఇండియా తో పాటు.. నార్త్ ఇండియా సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బన్నీ నేషనల్ హీరో అయిపోయాడు. మరి అంత క్రేజ్ ఉన్న హీరో ఒక్కోసారి కావాలని ఎందుకు వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నాడో ? ఎవరికీ అర్థం కావడం లేదు. ఎంత అవునన్నా కాదన్నా మెగా కాంపౌండ్ కు బన్నీకి మధ్య గ్యాప్ వచ్చేసింది.
బన్నీ రుద్రమదేవి సినిమా ఫంక్షన్ టైంలోనే పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడిగితే చెప్పను బ్రదర్ అంటూ పవన్ అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో మెగా ఫ్యామిలీని.. మెగా అభిమానులను కెలుకుతూ వాళ్ళను హర్ట్ చేస్తూ వస్తున్నట్టుగా ఆయన బిహేవియర్ కనిపిస్తోంది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ వేరు అల్లు అభిమానులు వేరు అన్నట్టుగా సపరేట్‌గా అల్లు ఆర్మీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.
ఇక తన అల్లు ఆర్మీ పాపులర్ అయ్యేందుకు బన్నీ చాలా ఖర్చు చేస్తూ తెరవెనక పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని కూడా గుసగుసలు ఉండనే ఉన్నాయి. బన్నీ ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతూ వేసిన ట్వీట్… చరణ్‌ను మాత్రం ఏదో తూతూమంత్రంగా ప్రశంసిస్తూ వేసిన ట్వీట్ చూస్తేనే ఇద్దరి మధ్య ఏదో తేడా కొడుతుందని తేటతెల్లమవుతోంది. అటు ఈ ఎన్నికలకు ఇండస్ట్రీ అంతా కూటమికి సపోర్ట్ చేసింది. బన్నీ మాత్రం తన భార్య స్నేహను వెంటేసుకుని వెళ్లి మరీ నంద్యాలలో వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా రవికిషోర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
ఆ టైంలో నాగబాబు సైతం మనోడు పరాయివాడు అని కౌంటర్ కూడా బన్నీకి ఇచ్చారు. ఆ తర్వాత పవన్ గెలిచి ఉప ముఖ్యమంత్రి అయినా.. చిన్న ట్వీట్ తప్పా ప్రత్యేకంగా కలిసి అభినందించింది లేదు. అంతకు ముందు ఎన్నికల్లో పవన్ పిఠాపురంలో పోటీ చేస్తే చివరకు జబర్దస్త్ నటీనటులు.. బుల్లి నటులు అందరూ అక్కడ మకాం వేసి మరీ పవన్‌ను గెలిపించేందుకు శాయశక్తులా కష్టపడ్డారు. ఆ టైంలో కూడా ఏదో ఇష్టం లేని ట్వీట్ వేసినట్టు ఉన్నాడే తప్పా పవన్ కోసం మనస్ఫూర్తిగా మెసేజ్లు లేవు… ప్రచారమూ లేదు. ఇక ఇప్పుడు జనసేనకు సపోర్ట్ చేసిన జానీ మాస్టర్‌కు అవార్డు వస్తే కూడా స్పందించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి.
నిజానికి తన పీఆర్ టీంకు చెప్పి జానీ మాస్టర్‌ను ప్రశంసిస్తూ ఓ ట్వీట్ వేయిస్తే సరిపోయేది.. ఇలా చేయకుండా ప్రతి విషయంలోనూ అనసవర రాద్దాంతాలకు ఎందుకు కారణమవుతున్నాడు ? బన్నీ టోటల్‌గా మెగా ఫ్యామిలీకి.. మెగా బ్రాండ్‌కు దూరం జరగడమే కాదు… తాను ఎదిగిన మూలాలను కూడా మరిచిపోతున్నాడన్న చర్చలు వస్తున్నాయి.