లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న తరుణంలో నయనతార ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ప్రభుదేవాకు దగ్గరయింది. ఇద్దరూ పీకల్లో ప్రేమలో మునిగితేలారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
నయనతార కోసం ప్రభుదేవా తన భార్య రమలతకు విడాకులు ఇచ్చేశాడు. అప్పట్లో ఈ మ్యాటర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రేపో మాపో ప్రభుదేవా, నయనతార మూడు ముళ్ళ బంధంతో ఒకటి అవుతారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుదేవా, నయనతార బ్రేకప్ చెప్పుకున్నారు. పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట ఎందుకు విడిపోయారు అనే ప్రశ్నకు కొన్ని కారణాలు ప్రధానంగా వినిపించాయి.
నయనతారకు ప్రభుదేవా పెట్టిన కండిషన్లే కొంపముంచాయని కోలీవుడ్ లో బలంగా టాక్ నడిచింది. క్రిస్టియన్ గా ఉన్న నయనతారను ప్రభుదేవా తన మతంలోకి మారాలని కోరాడట. అందుకు నయన్ ఒప్పుకుందట. అలాగే పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని.. హౌస్ వైఫ్ గా మారిపోవాలని ప్రభుదేవా కండీషన్ పెట్టాడట. అయితే అందుకు మాత్రం నయనతార ఒప్పుకోలేదు. మ్యారేజ్ తర్వాత కూడా యాక్టింగ్ కొనసాగిస్తానని.. కావాలంటే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని నచ్చజెప్పే ప్రయత్నిడం చేసిందట.
కానీ ప్రభుదేవా కన్విన్స్ కాలేదు. పైగా పెళ్లికి ముందే ఆదిపత్యం చలాయించడం స్టార్ట్ చేశాడట. ప్రభుదేవా తీరుకు విసుగు చెందిన నయనతార.. అతనితో లైఫ్ షేర్ చేసుకోవడం కష్టమని భావించి బ్రేకప్ చెప్పేసిందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. ఇక ప్రభుదేవాతో విడిపోయిన కొన్నేళ్లకు నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో లవ్ లో పడింది. ఆరేళ్లు రిలేషన్ లో ఉన్న ఈ జంట.. 2002లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఆపై సరోగతి పద్ధతిలో ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం నయనతార తన భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. మరోవైపు కెరీర్ ను కూడా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది.