Moviesపూరీ ఎందుకు హిట్ సినిమా తీయ‌లేడు… ప‌దే ప‌దే అవే త‌ప్పులు..?

పూరీ ఎందుకు హిట్ సినిమా తీయ‌లేడు… ప‌దే ప‌దే అవే త‌ప్పులు..?

తెలుగు చిత్ర సేమ అందించిన మంచి డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. రైటర్ గా పూరీకి తిరుగు లేదు. అదే అతడిని దర్శకుడుగా నిలబెట్టింది. పూరీ రాత.. హీరోయిజం… కథ‌ని నడిపించే విధానం ఇవన్నీ అప్పట్లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించాయి. ఇప్పుడు పూరీని చూస్తుంటే జాలేస్తుంది. పూరీలో ఉన్న ఆ గ్రాఫ్ ఎందుకు తగ్గిపోయింది అనిపిస్తుంది. లైగ‌ర్ డిజాస్టర్ తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది అని పూరి కాస్త వినయంగానే చెప్పాడు. కానీ డబుల్ ఇస్మార్ట్‌ చూస్తే పూరీ ఏం మారలేదని లైగ‌ర్ డిజాస్టర్ అతడికి ఎలాంటి పాఠాలు నేర్పలేదని అనిపిస్తుంది. పూరి ఇంకా బద్రి – ఇడియట్ రోజుల్లోనే ఉండిపోయాడు.

సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ్ళు సినిమాలకు ఓ కొత్త అర్ధాన్ని చెప్పారు. పూరి ఆ ప్లో పట్టుకుని దూసుకుపోవాలి.. కానీ ఇంకా హీరోలు హీరోయిన్ల వెంట పడటాలు.. సెపరేట్ కామెడీ ట్రాక్‌లు.. ఐటెం గోల అంటూ అక్కడే ఉండిపోయాడు. అందుకే పూరికి ఇలాంటి ఫలితాలే మళ్లీ మళ్లీ వస్తున్నాయి. కథ‌ల విషయంలో పూరి ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటాడు. బ్యాంకాంగ్ వెళ్లి వారం రోజుల కూర్చుని కథ రాసి వచ్చేస్తాడు.. కథ మీద పెద్దగా కతరత్తులు చేయడం.. తాను చూపించిన హీరోయిజం సినిమాను హిట్ చేస్తుందని పూరి నమ్ముతాడు. అందుకే లైగర్ – డబుల్‌ ఇస్మార్ట్ కథ‌ల విషయంలోను ఇలాగే వ్యవహరించాడు.

పూరీ దగ్గర కథలకు కొరత ఉండదు.. అలా కూర్చుని కథలు రాస్తూ పోతూ ఉంటాడు. తన దగ్గర కథల బ్యాంకు ఉందని చెబుతాడు.. కానీ ఆ కథలకు కాల దోషం పట్టేసింది. పూరి ఆ పాత ఆలోచనల నుంచి బయటకు రావలసిన అవసరం ఉంది. టెంపర్ తన కథ కాదు.. కానీ హిట్. ఇలా కొన్నాళ్లయిన పూరి బయటకు చేసుకొని సినిమాలు తీయాలి.. లేదంటే పూరి ఇక కెరీర్లో హిట్ సినిమా తీయలేడు. నువ్వు కథ రాసి సినిమా తీసే ముందు నాకు వినిపించు అని విజయేంద్రప్రసాద్ లాంటి రచయిత ఆఫర్ ఇచ్చిన పూరీ వాడుకోలేదు.

కనీసం తన కథ‌ల్లో త‌ప్పులు చెప్పగలిగే రచయితలను అయినా పూరి పక్కన పెట్టుకోవాలి.. నేను రాసిందే కథ‌.. నేను తీసింది సినిమా అనుకుంటే పూరికి ఇలాంటి పరాభవాలు తప్పవు. అన్నట్టు ఇండస్ట్రీలో వినిపించే మరో గుసగుస ఏంటంటే పూరి హీరోయిన్ ఛార్మిని పూర్తిగా పక్కన పెడితే తప్ప అతడు హిట్టు కొట్టలేడు అన్నది కూడా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news