సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు అనేది చాలా కామన్.. ప్రేమ, డేటింగ్ అనే వ్యవహారాలను చాలా కామన్ గా చూస్తూ ఉంటారు సెలబ్రిటీలు. కానీ కొంతమంది హీరోయిన్లు, హీరోలు మాత్రం వేరే వాళ్లతో ఘడమైన ప్రేమలో మునిగిపోతూ ఉంటారు. ఎంతలా అంటే వారిని పెళ్లి చేసుకునేంతలా.. అయితే ఇలా చేసుకున్న పెళ్లిళ్లు కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విఫలమవుతాయి..
అయితే గతంలో హీరోయిన్ ఇంద్రజ కూడా ఓ హీరోని గాఢంగా ప్రేమించిందని కానీ ఆ హీరో మాత్రం కేవలం సినిమాలో హీరోయిన్ గానే చూసారని ఓ గాసిప్ వినిపించింది. మరి ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. యమలీల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన ఇంద్రజ తర్వాత ఎన్నో తమిళ, కన్నడ,తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది.అయితే ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఈ హీరోయిన్ కి స్టార్ హోదా మాత్రం రాలేదు. అయితే ఎక్కువ సినిమాల్లో ఈమె సెకండ్ హీరోయిన్ గా చేసింది.
అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ లో కూడా నటించింది. అలా ఇంద్రజకి ఎక్కువ స్టార్డం అయితే రాలేదు. అయితే ఇంద్రజ అప్పట్లో ఓ హీరోని ప్రేమించిందని, టాలీవుడ్ మీడియాలో ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఇక ఆ హీరో ఎవరంటే రాజేంద్ర ప్రసాద్.. అప్పట్లో రాజేంద్రప్రసాద్ పై హీరోయిన్ ల విషయంలో ఎన్నో రూమర్స్ వినిపించాయి. అయితే అందులో ఎంత నిజముందో తెలియదు కానీ హీరోయిన్ ఇంద్రజ కూడా రాజేంద్ర ప్రసాద్ ని ప్రేమించిందని టాలీవుడ్లో కొంతమంది గుసగుసలు పెట్టుకున్నారు.
ఇక వీరి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే ఇంద్రజ ఆ హీరోతో కలిసి ఐదారు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుందని భావించారు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఇంద్రజలు మాత్రం హీరో హీరోయిన్స్ గా స్క్రీన్ మీద మాత్రమే నటించారని, వారి మధ్య పర్సనల్ గా ఎలాంటి రిలేషన్ లేదని ఆ తర్వాత బయటపడింది. ఇది కేవలం మీడియాలో వినిపించిన రూమర్ మాత్రమేనని అర్థమైంది. అయితే చాలామంది హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి రూమర్స్ ఎన్నో వినిపించాయి.