మెగాస్టార్ చిరంజీవి అల్లువారి అమ్మాయి సురేఖల పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే చిరంజీవి పెళ్లి గురించి ఎంతోమంది చర్చించుకుంటారు. అయితే అలాంటి చిరంజీవి చిరిగిన చొక్కా తోనే పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి సమయంలో అల్లు రామలింగయ్య మొహం వెలిగిపోతుంటే చిరంజీవి మొహం మాత్రం కాస్త వాడిపోయిందట. ఈ విషయాన్ని ఓ ఈవెంట్లో చిరంజీవి ఫన్నీగా చెప్పుకున్నారు. అంతేకాదు పెళ్లి జరిగే సమయంలో ఏంటండీ చిరిగిన చొక్కా వేసుకున్నారని కొంత మంది అంటే ఏదైతే నీకేంటి అని కాస్త కసురుకున్నారట.
ఏది ఏమైనప్పటికి చిరంజీవి ఒక మంచి భార్యని ఏరి కోరి మరీ తెచ్చుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయం పక్కన పెడితే.. చిరంజీవి సురేఖల పెళ్లికి సత్యనారాయణ అనే మిస్టరీ మాన్ కారణమయ్యారట. మరి ఆయన ఎవరు.. వీరి పెళ్లికి ఎలా కారణమయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..చేశారు.అలా ఓ రోజు అల్లు రామలింగయ్య ఇంటి పై పోర్షన్ లో ఉండే సత్యనారాయణ అనే వ్యక్తి కోసం చిరంజీవి అల్లు వారి ఇంటికి వెళ్లారట.
ఆ సమయంలో అల్లు రామలింగయ్య భార్య వచ్చి మీకు ఎవరు కావాలి అని అడిగిందట. దాంతో చిరంజీవి సత్యనారాయణ కోసం వచ్చానని చెప్పగానే ఆయన పైన ఉంటారు అని చెప్పి పంపించిందట. ఆ తర్వాత ఆయన చిరంజీవి కదా ఈ మధ్య సినిమాల్లో కనిపిస్తున్నాడు బాగున్నాడు కుర్రాడు అని అల్లు రామలింగయ్య భార్య ఈ విషయాన్ని ఆయనతో పంచుకుందట. అంతేకాదు మన కూతురు సురేఖకు ఆయన జోడి ఎలా ఉంటుందని రామలింగయ్యకి చెప్పగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు వద్దు అని మొహం మీదే అన్నారట.ఆ తర్వాత ఓ 20 రోజులపాటు చిరంజీవితోనే అల్లు రామలింగయ్య సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.
ఆ సమయంలో చిరంజీవి గురించి పూర్తిగా సిబిఐ ఎంక్వయిరీ చేసినట్టు చేసి ఆయన అలవాట్లు అన్నీ తెలుసుకొని సురేఖకు మంచి జోడి అనుకున్నారట. అయితే ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఆలీతో జాలీగా అనే ప్రోగ్రాంలో బయట పెట్టారు.అలా ఓ రకంగా చిరంజీవి సురేఖ ల పెళ్లికి కారణం సత్యనారాయణ అనే వ్యక్తి అయ్యారు. అయితే సత్యనారాయణ సినీ ఇండస్ట్రీలో పని చేస్తారట. అల్లు ఫ్యామిలీతో దూరపు బంధుత్వం ఉందట. ఇక సత్యనారాయణ కోసం వచ్చిన చిరంజీవిని అల్లు రామలింగయ్య భార్య చూసి తన ఇంటి అల్లుడుగా చిరంజీవి సెట్ అవుతాడని అదే రోజు నిర్ణయించుకుంది.