నిత్య మీనన్.. క్యూట్ నవ్వుతో కర్లీ హెయిర్ తో ఎంతోమంది కుర్రాల మతి పోగొట్టే నిత్యమీనన్ సౌత్ లో ఎంత ఫేమస్ హీరోయిన్ చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నితిన్, పవన్ కళ్యాణ్, నాని, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో జత కట్టింది.అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈమె కేవలం తెలుగులోనే కాదు తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా చేసింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని పెళ్లి చేసుకోమని వెంటపడింది ఎవరు? ఆమెని టార్చర్ చేసింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
నిత్యామీనన్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది ఎవరో కాదు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. దుల్కర్ సల్మాన్ తెలుగు వారికి కూడా సుపరిచితుడే. అయితే పెళ్లయిన దుల్కర్ నిత్యామీనన్ ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందుకు ఇబ్బంది పెట్టారా అని మీరు అనుకుంటున్నారా.. అయితే ఇది నిజంగా నిత్య మీనన్ ని రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో అని కాదు. సరదాగా అలా నిత్యమీనన్ ని ఆట పట్టించేవారట.అయితే ఈ విషయాన్ని నిత్య మీనన్ ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
అయితే ఓ ఇంటర్వ్యూలో నిత్య మీనన్ కి దుల్కర్ సల్మాన్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని నిజంగానే దుల్కర్ సల్మాన్ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారా అని యాంకర్ అడగగా.. అవును దుల్కర్ సల్మాన్ నన్ను కలిసిన ప్రతిసారి నన్ను రెండో పెళ్లి చేసుకోవాలని ఆట పట్టిస్తూ ఉంటాడు.
అయితే ఇది నిజంగా కాదు.మా మధ్య ఉన్న క్లోజ్ నెస్ తో అలా ఫన్నీగా నన్ను ఆట పట్టించేవాడు.
అంతేకాదు నువ్వు ఇప్పుడే ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో లేకపోతే నాకు పెళ్లి వయసు వస్తే బాగుండదు అంటూ దుల్కర్ సల్మాన్ ఆట పట్టించేవాడు. కానీ ఆ సమయంలో నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఆసక్తి లేదు అని చెప్పేదాన్ని అంటూ నిత్యామీనన్ దుల్కర్ సల్మాన్ తో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టింది. అయితే దుల్కర్ సల్మాన్ నిత్యామీనన్ కాంబినేషన్లో 100 డేస్ లవ్, బెంగళూరు డేస్, ఓ కాదల్ కన్మణి, ఉస్తాద్ హోటల్ వంటి సినిమాల్లో నటించారు.