తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. 2011లో ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాస్ కుమార్తె నార్నే లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహమే అయిన కూడా పర్ఫెక్ట్ వైఫ్ అండ్ హెస్బెండ్ గా లక్ష్మీ ప్రణతి-ఎన్టీఆర్ గుర్తింపు పొందారు.
అలాగే ఈ జంట 2014లో తమ మొదటి బిడ్డ అభయ్ రామ్.. 2019లో రెండో బిడ్డ భార్గవ్ రామ్ కు జన్మనిచ్చారు. ఇకపోతే ఎన్టీఆర్ తో పెళ్లి తర్వాత లక్ష్మీ ప్రణతి కొన్ని విమర్శలను ఎదుర్కొంది. నందమూరి ఫ్యామిలీకి యాంటీ ఫ్యాన్స్ అయిన కొందరు ఆమెను టార్గెట్ చేశారు. ఐరన్ లెగ్ అంటూ లక్ష్మీ ప్రణతిని అవమానించారు. ఇందుకు కారణం లేకపోలేదు. మ్యారేజ్ అయ్యాక కెరీర్ పరంగా ఎన్టీఆర్ చాలా స్రగ్గుల్స్ ను ఫేస్ చేశాడు.
2011 నుంచి 2014 వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో నలిగిపోయాడు. 2011లో రిలీజ్ అయిన శక్తి మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. అదే ఏడాది వచ్చిన ఊసరవెల్లి కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అలాగే 2012లో దమ్ము, 2013లో బాద్‌షా, రామయ్యా వస్తావయ్యా, 2014లో రభస చిత్రాలు విడుదలై ఎన్టీఆర్ కు షాకుల మీద షాకులు ఇచ్చాయి. దీంతో కొందరు యాంటీ ఫ్యాన్స్ లక్ష్మీ ప్రణతిని ట్రోల్ చేశారు.
ప్రణతి రాకతోనే ఎన్టీఆర్ కెరీర్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయిందని.. ఆమెతో పెళ్లి ఎన్టీఆర్ కు అస్సలు కలిసి రాలేదని విమర్శించారు. ఐరన్ లెగ్ అంటూ లక్ష్మీ ప్రణతిని దారుణంగా అవమానించారు. ఈ కామెంట్స్ లక్ష్మీ ప్రణతి మానసికంగా కృంగదీశాయి. అయితే అటువంటి టైమ్ లో భార్యకు ఎన్టీఆర్ అండంగా నిలబడ్డాడట. ఇండస్ట్రీలో జయాపజయాలు సర్వసాధారణం.. వీటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని లక్ష్మీ ప్రణతికి నచ్చజెప్పాడట. కట్ చేస్తే.. 2015లో వచ్చిన టెంపర్ మూవీ ఎన్టీఆర్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగాడు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.