నేషనల్ క్రష్ అనగానే సినీ ప్రియులకు మొదట గుర్తుకు వచ్చే పేరు
2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక.. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయింది. ఛలోతో టాలీవుడ్ లోకి ప్రవేశించి తెలుగు వారి హృదయాలు దోచుకుంది. సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేస్తూ అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని.. సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది.
కొత్త భామలు ఎంత మంది వస్తున్నా.. వారికి ధీటుగా నిలబడి కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది. అయితే రష్మిక ప్రస్తుతం అనుభవిస్తున్న స్టార్డమ్ అంత సులభంగా వచ్చింది కాదు. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని రష్మిక కెరీర్ ఆరంభంలో చాలా స్ట్రగ్గుల్స్ ఫేస్ చేసింది. ఎన్నో అవమానాలు.. మరెన్నో తిరస్కరణలకు గురైంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న రష్మిక.. కెరీర్ తొలినాటి కష్టాలను గుర్తు చేసుకుంది.
రష్మిక మాట్లాడుతూ.. నాకు అంత సులభంగా అవకాశాలు రాలేదు. ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగొచ్చేదాన్ని. ఆడిషన్స్ లో కొందరైతే యాక్టింగ్ కు పనికొచ్చే ఫేసేనా.. నటిగా పనికి రావంటూ అవమానించేవారు. చివరకు ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది. మూడు నెలల పాటు వర్క్‌షాప్స్ లో పాల్గొన్నాను. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత 25 ఆడిషన్స్ లో నన్ను తిరస్కరించారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడూ సినిమా రంగం నుంచి తప్పుకోవాలని అనుకోలేదు. నా ప్రయత్నాలనూ ఆపలేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ.. ప్రతి సినిమాకు నటిగా నన్ను నేను మెరుగుపరుచుకున్నాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. రష్మిక ఇప్పుడు పుష్ప 2, కుబేర, రెయిన్ బో, సికిందర్ తదితర చిత్రాల్లో నటిస్తోంది.