టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒకప్పుడు తిరుగులేని సినిమాలు అందించారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి డిఫరెంట్ సినిమాల నుంచి పోకిరి – బిజినెస్‌మేన్ లాంటి బ్లాక్బస్టర్ల వరకు పూరి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఉండేది… హీరో ఎవరన్నది ? ప్రేక్షకుడికి అనవసరం. పూరి సినిమా అయితే చాలు సంబరపడిపోయేవారు.. ఆ తర్వాత నుంచి పూరి గ్రాఫ్ కిందకు జారటం తప్ప పైకి లేవడం లేదు. కళ్యాణ్ రామ్ – నితిన్ – పవన్ కళ్యాణ్ – విజయ్ దేవరకొండ – రామ్ తన కొడుకు ఆకాష్ ఇలా దొరికిన ప్రతి హీరోతో పూరి సినిమా చేస్తున్నాడు.. తప్ప హిట్ రావటం లేదు.
ఎంతసేపు హీరోలను తన స్టైల్ లోకి ఎలా మార్చాను ? అన్నది మాత్రమే పూరి చూసుకుంటున్నాడు తప్ప అసలు కథ ఏమిటి ? కథనం ఏమిటి ? ఎలాంటి కామెడీ ట్రక్ రాస్తున్నాను అన్నవి అన్ని పూరి మర్చిపోతున్నాడు. ఒకప్పుడు సినిమాలు మాత్రమే వేగంగా తీస్తారు అన్న పేరు తెచ్చుకున్న పూరి… ఇప్పుడు కథలు వండటం కూడా అంతే వేగంగా చేస్తున్నారు. డిజాస్టర్లు కూడా అంతే వేగంగా వస్తున్నాయి. పూరి తీసిన గత పది సినిమాలలో ఇస్మార్ట్ శంకర్ ఒకటి మాత్రమే హిట్ అయింది. ఈ సినిమాకి అన్ని కలిసి వచ్చాయి.. వెంటనే పెద్ద సినిమా లైగర్ వచ్చింది. విజయ్ దేవరకొండ హీరో పైగా పాన్ ఇండియా సినిమా … ఎలాంటి కథ రాయాలి ? అబ్బే పూరీకి అవేవీ పట్టలేదు.
హీరో ఆటిట్యూడ్ .. పాటలు… డాన్సులు… ఎక్స్పోజింగ్ సరిపోతాయి అనుకున్నాడు.. కావాలంటే కామెడీ ట్రాక్ పెట్టి పడేస్తాడు.. సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత తాను ఒళ్లు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా డబుల్ ఇస్మార్ట్ అని పూరి చెప్పడంతో… పూరి నిజంగానే మారి ఉంటాడని చెప్పి అని అందరూ అనుకున్నారు. సినిమా అంతా అయ్యాక చూస్తే చాలా దారుణంగా ఉంది. అసలు అప్పటికప్పుడు ఆలీ కామెడీ ట్రాక్ యాడ్ చేశారు.. ఈ కామెడీ ట్రాక్ అయితే చాలా దారుణంగా ఉంది. ఏది ఏమైనా పూరి ఇంతకన్నా గొప్పగా ఆలోచన చేయలేకపోతున్నారు అన్నది వాస్తవం.
ఇస్మార్ట్ శంకర్‌నే కాస్త అటు ఇటు తిప్పి డబుల్ ఇస్మార్ట్ తీసేశారు. పైగా సంజయ్ దత్‌ను తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు పూరికి అందరు హీరోలు డేట్లు ఇచ్చేశారు… పూరి జగన్నాథ్ కు సినిమా ఇచ్చేది ఎవరు ? డేట్ లు ఇచ్చేది ఎవరు? అసలు టాలీవుడ్ లో డైరెక్టర్లు రెండేళ్లకు ఒక సినిమా తీస్తున్నారు.. కొందరు మూడేళ్లకు ఒక సినిమా తీస్తున్నారు. డైరెక్టర్లు దొరకక నిర్మాతలు వెతుకుతున్న వేళ ..పూరి జగన్నాథ్ కు డేట్లు ఇచ్చే హీరోలు… పూరీతో సినిమాలు తీసే నిర్మాతలు లేకపోవడం బాధాకరం. ఇది పూరి పతనావస్థను సూచిస్తుంది. ఏది ఏమైనా పూరీలో చరిష్మా తగ్గింది.. ఆలోచన తగ్గింది అన్నది సినిమా జనాలకు పూర్తిగా అర్థం అయింది.