నటసింహం నందమూరి బాలకృష్ణ … దర్శకులకు ఎంతో విలువ ఇస్తారు … ఒకసారి కథ విని ఓకే చెప్పాక అసలు దర్శకుల విషయాల్లో బాలయ్య జోక్యం చేసుకోరు. దర్శకుడిని నమ్మితే గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు. అదేంటి ఇదేంటి అన్న ప్రశ్నలు ఉండవు. అయితే బాలయ్య మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కొంత మంది దర్శకులు డిజాస్టర్లు కట్టబెట్టారు. బాలయ్యలా ఏ హీరో కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు అని టాలీవుడ్ లో ఏ దర్శకుడుని అడిగినా చెబుతారు. అయితే ఇప్పుడు బాలయ్యలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వరుస హిట్లతో పాటు బాలయ్య కెరీర్ పరంగా తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. దీంతో ఇప్పుడు సినిమా మధ్య మధ్యలో చూసుకోవటం … మార్పులు.. చేర్పులు చెప్పటం అవసరమైతే కొన్ని సీన్లు రీషూట్లు చేయటం … స్క్రిప్టు మార్చటం ఇవన్నీ బాలయ్యలో కొత్తగా కనిపిస్తున్న లక్షణాలు.
బాలయ్య – బాబి కాంబినేషన్లో బాలయ్య 109వ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఓకే అయ్యాక కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రష్ చూసుకున్న బాలయ్య ఇందులో ఓ ట్రాక్ మొత్తం తీసేసి కొత్తగా రీ షూట్ చేయాలని ఆదేశించారట. స్టార్ హీరోలు సినిమాలకు ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది.. కానీ బాలయ్య సినిమాలకు మాత్రం ఇలా జరగటం తొలిసారి అని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇక బాలయ్య ప్రాజెక్టుల విషయంలో పెద్ద కుమార్తె బ్రాహ్మణి… రెండో కుమార్తె తేజస్విని కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక బాలయ్య విగ్గు – కాస్ట్యూమ్స్ – స్టైలింగ్ ఇలాంటి విషయాలన్నీ బ్రాహ్మణి – తేజస్విని చూసుకుంటున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య లుక్ బాగుంది… కాస్ట్యూమ్స్ బాగా నప్పాయి. ఇక బాబీ సినిమాకు సంబంధించి ఓ లుక్ ఇప్పటికే లీక్ అయింది. ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంది.. ఆ గెటప్ కూడా బాగా ఆకట్టుకుంది.. ఏది ఏమైనా బాలయ్య మరింత కొత్తగా సరికొత్త అందంగా కనిపిస్తున్నాడు అన్నది అభిమానులు… టాలీవుడ్ సర్కిల్స్ మాట. ఏది ఏమైనా ఇప్పుడు బాలయ్య తీసుకునే జాగ్రత్తలతో 109 వ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.