దర్శకుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరకు అపజయం అన్నదే లేకుండా సినిమాలు తీస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఆయన నేమ్ అండ్ సేమ్ సంపాదించుకున్నారు. రాజమౌళితో కలిసి పనిచేయాలని అగ్ర హీరో హీరోయిన్లు కూడా తహతహలాడుతుంటారు. కానీ చెన్నై సోయగం త్రిష మాత్రం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేసే అవకాశం వస్తే చెయ్యను పొమ్మన్నదట.
ఇంతకీ రాజమౌళి దర్శకత్వంలో త్రిష మిస్ చేసుకున్న మూవీ మరేదో కాదు మర్యాద రామన్న. స్టార్ కమెడియన్ సునీల్ ఈ చిత్రంలో హీరోగా చేశాడు. అతనికి జోడిగా కొత్త భామ సలోని నటించినది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ యాక్షన్ కామెడీ డ్రామా 2010లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రూ. 12 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన మర్యాద రామన్న ఫుల్ రన్ లో రూ. 28 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిషను అనుకున్నారట. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. అప్పటికే తెలుగు మరియు తమిళ భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. అలాంటి సమయంలో మర్యాద రామన్న మూవీ లో అవకాశం రాగా.. సునీల్ వంటి కమెడియన్ పక్కన తాను నటించినని త్రిష డైరెక్ట్‌గానే చెప్పేసిందట. రాజమౌళి దర్శకత్వంలో పనిచేసే అవకాశాన్ని సునీల్ కారణంగా వదులుకుందట. ఇక ఆ తర్వాత మరికొంతమంది హీరోయిన్లను పరిశీలించిన రాజమౌళి.. ఫైనల్ గా సలోనిని సెలెక్ట్ చేశారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో సునీల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం.