మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని హరీష్ శంకర్ డైరెక్టర్ చేయగా.. టిజి విశ్వప్రసాద్ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో రవితేజకు జోడిగా నటించింది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ను మూగట్టుకుంది. పైగా పోటీగా ఇస్మార్ట్ శంకర్, ఆయ్ వంటి సినిమాలు ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద రవితేజ మూవీ సరైన ఇంప్యాక్ట్ చూపలేకపోతోంది.
ముఖ్యంగా రెండో రోజు మిస్టర్ బచ్చన్ దారుణమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. నెగటివ్ టాక్ వల్ల దాదాపు అన్ని ఏరియాల్లో భారీ డ్రాప్స్ ఏర్పడ్డాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.56 కోట్ల షేర్ కలెక్షన్స్ ను రాబట్టిన మిస్టర్ బచ్చన్.. రెండో రోజు కేవలం రూ. 80 లక్షలతో సరిపెట్టుకుంది. అలాగే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 5.26 కోట్ల షేర్, రూ. 7.80 గ్రాస్ కలెక్షన్స్ వస్తే.. సెకండ్ డే రూ. 88 లక్షల షేర్, రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
మిస్టర్ బచ్చన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లు. ఇప్పటి వరకు సినిమా రూ. 6.14 కోట్ల షేర్, రూ. 9.45 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ కొట్టాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా రూ. 25.86 కోట్ల షేర్ ను వసూల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద టార్గెట్ ను అందుకోవడం నిజంకాని ఒక కలే అని సినీ విశేషకులు అభిప్రాయపడుతున్నారు. రవితేజకు మరో డిజాస్టర్ ఖాయమని చెప్పేస్తున్నారు. కాగా, ఏరియాల వారీగా మిస్టర్ బచ్చన్ 2 డేస్ వరల్డ్ వరల్డ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి..
నైజాం- 2.46 కోట్లు
సీడెడ్- 86 లక్షలు
ఉత్తరాంధ్ర- 59 లక్షలు
తూర్పు- 33 లక్షలు
పశ్చిమ- 24 లక్షలు
గుంటూరు- 43 లక్షలు
కృష్ణ- 25 లక్షలు
నెల్లూరు- 20 లక్షలు
ఏపీ + తెలంగాణ = 5.36 కోట్లు(7.90 కోట్లు~ గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా- 36 లక్షలు