MoviesTL రివ్యూ : తంగ‌లాన్‌… విక్ర‌మ్ ఏంది సామీ ఈ ఊచ‌కోత‌

TL రివ్యూ : తంగ‌లాన్‌… విక్ర‌మ్ ఏంది సామీ ఈ ఊచ‌కోత‌

కబాలి – కాల లాంటి మంచి కథాబలం ఉన్న సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ ఫా. రంజిత్‌. అపరిచితుడు – ఐ – శివపుత్రుడు లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన హీరో చియాన్‌ విక్రమ్‌. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా తంగలాన్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీనికి కారణం విక్రమ్‌ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించాడు. ఆగస్టు 15 కానుకగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి.

ఇక సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాలో విక్రమ్ ఊచకోత కోసి పడేసారని మెచ్చుకుంటున్నారు. విక్రమ్ అసాధారణమైన నటన.. సినిమాలో పాత్ర పట్ల అంకితభావం.. హీరో అంటే గ్లామర్ మాత్రమే కాదని మరోసారి నిరూపించాడని అంటున్నారు. తంగలాన్ విక్రమ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుందని.. సినిమాలో అద్భుతమైన నటనకు ప్రతి ఒక్కరు మంత్రముగ్ధుల అయ్యామంటూ ఎగ్స్ వేదికగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా విక్రమ్ నటనపై అయితే ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్రమ్ నటన అద్భుతం అని .. మాళవిక న‌ట‌న‌తో పాటు డి గ్లామర్ రోల్ బాగా చేసినదని చెబుతున్నారు.

సినిమా ఫస్ట్ స్టాప్ లో విక్రం నటన వేరే లెవెల్ లో ఉంది. అటు మాళవిక నటన కూడా అదిరిపోయిందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో విక్రం బాడీ లాంగ్వేజ్ చూస్తున్న ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోతారట. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే కన్నార్పకుండా చూస్తాం అని అంటున్నారు. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకుడు సినిమా మూడ్‌లో ట్రావెల్ అయ్యేలా ఉందంటున్నారు. ఇక సెంటిమెంట్ సీన్లలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కన్నీళ్లు తెప్పించేలా ఉందని.

మరి ముఖ్యంగా తమిళ‌ ఆడియన్స్ కు ఈ సినిమా కథ బాగా కనెక్ట్ అవుతుందని… విక్రమ్‌ పాత్ర కూడా వారికి బాగా నచ్చుతుందని అంటున్నారు. తమిళ‌ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా ఎక్కుతుందని తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకు ? నచ్చుతుందో చూడాలని కొందరు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియా ట్రెండింగ్‌ల‌లో మాత్రం తంగలాన్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news