Moviesదేవ‌ర ' ఫస్ట్ షోకు ముహూర్తం ఇదే… వ‌ర‌ల్డ్ వైడ్‌గా సెన్షేష‌న్‌…...

దేవ‌ర ‘ ఫస్ట్ షోకు ముహూర్తం ఇదే… వ‌ర‌ల్డ్ వైడ్‌గా సెన్షేష‌న్‌… !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్‌ దేవర. ఆర్ఆర్ఆర్‌ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా ఇదే. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమాపై.. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా దేవర థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు పై ప్రేక్షకుల్లో, అభిమానులలో.. ఆకాశాన్ని అంటే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీమియర్ షోకు ముహూర్తం ఖరారు చేశారు. భారతీయ కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1.08 గంటలకు ఇటు ఇండియాతో పాటు.. అటు యూఎస్ ప్రాంతంలో ఒకేసారి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దేవర నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలు, స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.

ఆమెకు తెలుగులో ఇదే తొలి సినిమా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ కూడా మరో విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా దేవర సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది.. తెలుగు సినీ అభిమానులలో ఉత్కంఠ బాగా పెరిగిపోతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news