సెలబ్రిటీల పెళ్లిళ్లు.. ప్రేమలు డేటింగ్ పూర్తయ్యాక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. ముందుగా స్నేహం చేస్తారు.. తర్వాత ప్రేమలో పడతారు.. ఆ తర్వాత డేటింగ్ ఉంటుంది.. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఆ తర్వాత కొద్ది రోజులకు డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా అన్ని క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. అయితే ఇది అందరి హీరోల విషయంలో జరగదు.. టాలీవుడ్ లో దగ్గుపాటి వారసుడు రానా చాలా సింపుల్ గా ఉంటారు. అలాగే రానా పెళ్లి కూడా కరోనా టైంలో చాలా సింపుల్ గా జరిగింది.
అయితే ఇక్కడ మేటర్ అదికాదు.. రానా తన భార్య మిహికాతో ప్రేమలో పడటం అనేది పెద్ద ట్విస్టింగ్ గా ఉంటుంది. ముందుగా మిహికాను ఓ యాప్ లో కలిశాడు.. అలా కలిసిన వారంలోనే పెళ్లి చేసుకున్నాడు.. అదే విచిత్రం. కరోనా టైంలో హౌజ్ పార్టీ అనే యాప్ డౌన్లోడ్ చేశాను.. అందులో చాలా మందిని కలవచ్చు.. మనం మరికొంతమందిని యాడ్ చేయవచ్చు… అలా సర్కిల్ పెరుగుతుంది.. చాలా కాలం కిందట కలిసిన ఓ వ్యక్తిని మళ్లీ అందులో చూశాను.. ఆ తర్వాత వారం రోజులకే ఆమెను పెళ్లి చేసుకున్నాను అని రానా చెప్పాడు. రానా మిహికాకు ప్రపోజ్ చేయడం కూడా చాలా విచిత్రంగా జరిగిందట.
యాప్లో కలిసిన వెంటనే ముందుగా మాటలు కలిపారట. ఆ వెంటనే పెళ్లి చేసుకుందామా ? అని మిహికాను అడిగాడంట. రానా సడన్గా అడగడంతో మిహికా కూడా కన్ఫ్యూజ్ అయిందట. రానా తనను సరదాగా ఆటపట్టిస్తున్నాడని భావించిందట. ఆ తర్వాత వేరే వ్యక్తులు ద్వారా రానా ఎలాంటివాడు ? అతడి నేపథ్యం ఏంటి ఇలా అన్ని విషయాలు కనుక్కొని వెంటనే ఓకే చెప్పిందట. అలా తన జీవితంలో పెళ్లి అనేది చాలా క్రేజీగా జరిగిందని చెప్పి కొచ్చాడు. మరి మాటలు కలిసిన వారం రోజులకే పెళ్లి చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. దీనిని కనుక సినిమాగా తీస్తే ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్టే అవుతుంది.