పైన సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన ఉన్న వృద్ధుడిని చూసే ఉంటారు. అతను రజనీకాంత్ దత్త తండ్రి. అవును, మీరు విన్నది నిజమే. కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో రజనీకాంత్ చోటు దక్కించుకుంటే.. ఆ వృద్ధుడు మాత్రం రజనీకాంత్ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదా.. పాలం కల్యాణ సుందరం. ఎందరో మహానుభావులు.. అందులో ఆయన ఒకరు.
మ్యాన్ ఆఫ్ ది మిలీనియంగా పేరుగాంచిన ఒక లైబ్రేరియనే కళ్యాణ సుందరం. బక్కగా, పీలగా తెల్లని షర్టు, పంచెకట్టుతో సాధారణంగా కనిపించే ఆయన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకి చెందిన వారు. మానవతావాదిగా మరియు సామాజిక కార్యకర్తగా ప్రసిద్ధి చెందారు. దాదాపు 30 ఏళ్లు తమిళనాడు ప్రభుత్వంలో లైబ్రేరియన్ గా విధులు నిర్వర్తించారు. 30 ఏళ్ల సర్వీసులో వచ్చిన జీతం మొత్తాన్ని కళ్యాణ సుందరం దాన ధర్మాలు. ఎంతో మంది పేదలకు అండగా నిలిచారు.
జీతంలో ఒక్క పైసా కూడా ఆయన వినియోగించుకోలేదు. వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు కళ్యాణ సుందరం ఓ హోటల్ లో సర్వర్ గా పని చేస్తూ ప్రతిఫలం పొందారు. అలాగే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన రూ. 10 లక్షలను సమాజ సేవకు ఉపయోగించారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కళ్యాణ సుందరం సేవలను గుర్తించి మేన్ ఆఫ్ ది మిలీనియం తో పురస్కరించింది. ఈ పురస్కారం కింద వచ్చిన రూ. 30 కోట్లను కూడా కళ్యాణ సుందరం స్వచ్ఛంద సంస్థలకే డోనేట్ చేసేశారు. అటువంటి గొప్ప మనిషిని సూపర్ రజనీకాంత్ తన తండ్రిగా దత్తత తీసుకున్నారు. ఆయన్ను తన ఇంటికి తీసుకెళ్లాలని చాలా సార్లు ప్రయత్నించారు. కానీ నిరాడంబర జీవితాన్ని ఇష్టపడే కళ్యాణ సుందరం సున్నితంగా రజనీ ఆఫర్ ను తిరస్కరించారట.