తెలుగు సినిమా గర్వించదగ్గ కొద్దిమంది స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా రంగంలో తన ప్రస్తానాన్ని చిరంజీవి కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే భారీ ఫాంటసీ సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి చిరంజీవి పుట్టినరోజుకు మెగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ఇంద్ర సినిమాను నిర్మాతలు థియేటర్లలోకి దింపుతుండగా… ఈ సినిమాకు భారీ బుకింగ్ నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంద్ర సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.
ఇంద్ర సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అగ్ర నిర్మాత చలసాని అశ్వినీదత్ నిర్మించగా.. యాక్షన్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించారు. 2002 … జూలై 24న ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నింటిని తిరగ రాస్తూ 122 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. అప్పటివరకు చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సోనాలి బింద్రే – ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి పలికిన ప్రతి పవర్ఫుల్ డైలాగ్ థియేటర్లలో గట్టిగా పేలింది.
ఇప్పటికీ కూడా ఈ డైలాగులకు విజిల్స్ పడతాయి. అయితే ఈ సినిమా డైలాగుల విషయంలో చిరంజీవి పాత్ర కూడా చాలా ఉంది. మొదట్లో తన బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా డైలాగులు రాయాలని… ఓవర్‌గా అనిపించే డైలాగుల వద్దని చిరంజీవి రచయిత పరుచూరి గోపాలకృష్ణకి చెప్పారట. నా అభిమానులు డైలాగులు కంటే డ్యాన్స్… స్టెప్పులు అడుగుతారని అందుకే కొంచెం తక్కువ మోతాదు ఉన్న డైలాగులే రాయాలని చెప్పారట.. కానీ సినిమా ఆడియో ఫంక్షన్ రోజున చిరుకు ఫ్యాన్స్ పెద్ద షాకిచ్చారు. ఎప్పుడు ఒక స్టెప్ వేయమని అడిగే అభిమానులు… సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పమని అడగడంతో చిరంజీవికి ఏం చెప్పాలో ? తెలియలేదట.
అయితే ఇంద్ర ఆడియో ఫంక్షన్ నాటికే 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన 20 శాతం షూటింగ్లోనే చిరంజీవి పట్టుపట్టి కొన్ని డైలాగులు రాయించుకున్నారట. ఈ విషయాన్ని పరుచూరి స్వయంగా వెల్లడించారు. ఒకవేళ ఆడియో ఫంక్షన్ లో అభిమానులు చిరంజీవి డైలాగులు చెప్పమని అడగకుండా ఉండి ఉంటే ఇంద్ర సినిమాలో అంత పవర్ ఫుల్ డైలాగ్లు ఉండేవే కాదని చెబుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ కాబోతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు.