మెగా ఫ్యామిలీలో విభేదాలు అలాగే కొనసాగుతున్నాయా ? బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి లేదు సమరమే అన్నట్టుగా ముందుకు వెళుతున్నాడా ? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవునని అర్థమవుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం స్మగ్లర్లు అంటూ పరోక్షంగా బన్నీపై సెటైర్లు వేసాడు అంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సాధారణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా బన్నీ కేవలం ఒక చిన్న ట్వీట్ వేసి సరిపెట్టేసాడు. అదే టైములో పవన్ ప్రత్యర్థ పార్టీకి చెందిన వైసిపి అభ్యర్థికి తన భార్యతో సహా వెళ్లి మరి ప్రచారం చేసి వచ్చాడు. దానిపై అప్పట్లో నాగబాబు కూడా భగ్గుమన్న సంగతితెలిసిందే.
మనవాడు పరాయి వాడు అంటూ చాలా పెద్ద ట్వీట్ వేసి ఆ తర్వాత డిలీట్ చేశాడు. ఏది ఏమైనా గత నాలుగు సంవత్సరాలుగా మెగా కాంపౌండ్ కు ఇటు బన్నీకి మధ్య గ్యాప్ వచ్చేసింది అనేది బహిరంగ రహస్యం. బన్నీ వాస్ లాంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. ఇదంతా గతం.. తాజాగా మెగా ఆడపడుచు నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా కోసం తన పరిచయాలు అన్నింటిని బయటకు తీస్తోంది. మెగా డాటర్ నిహారిక తమ కాంపౌండ్ నుంచి మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులని తన సినిమా ప్రచారంలోకి ఆమె తీసుకువస్తుంది.
చివరకు మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా సినిమా బాగుంది చూస్తాను అని మరి మెసేజ్ పెట్టారు. అందరూ సినిమాపై స్పందిస్తున్నారు.. ఒక్క బన్నీ తప్ప. బన్నీ పుష్ప 2 సినిమాతో మరి అంత బిజీగా ఏం లేడు. పైగా బన్నీ వాసు ఆయ్ సినిమాను ప్రమోట్ చేశాడు.. కమిటీ కుర్రాలను మాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో నిహారిక బన్నీని సంప్రదించ లేదా ? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. నిహారిక సంప్రదించిన సంప్రదించకపోయినా బన్నీ స్వయంగా జోక్యం చేసుకొని ఒక చిన్న మెసేజ్ వేసిన సినిమాకు చాలా ప్లస్ అయి ఉండేదని.. పైగా మెగా కాంపౌండ్ బన్నీ మధ్య గ్యాప్ ఉందని జరుగుతున్న ప్రచారానికి కొంతవరకు అయినా చెక్ పెట్టినట్టు ఉండేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
ఏది ఏమైనా కమిటీ కుర్రాళ్ళ కోసం చిరంజీవి చరణ్ నుంచి మొదలుపెట్టి మహేష్ బాబు – రాజమౌళి – సుకుమార్ – నాని – రానా డైరెక్టర్ క్రిష్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ట్రీట్ వేశారు. బన్నీ ఒక్కడు మాత్రం మిస్ అయ్యి అనేక సందేహాలకు తెరలేపాడు.