ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో హీరో హీరోయిన్స్ ఎంత బాగా నటించినా కూడా తెర వెనుక వీరి మధ్య స్నేహం అంతా బాగా ఉంటుంది అనుకుంటే పొరపాటు పడ్డట్లే.. ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో కేవలం సినిమా కోసం మాత్రమే నటిస్తారు. ఇక ఆఫ్ స్క్రీన్ లో వీరి మధ్య గొడవలు ఉండవచ్చు.. స్నేహం ఉండవచ్చు.. అంతకంటే పెద్ద రిలేషన్ కూడా ఉండవచ్చు.అది మనకు అనవసరం..కానీ ఓ హీరోయిన్ మాత్రం హీరో నితిన్ ని బండ బూతులు తిట్టిందట.. అయితే ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు నితిన్ ని తిట్టింది అనేది ఇప్పుడు చూద్దాం..
నితిన్ ని తిట్టినట్టు అప్పట్లో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది మీడియా గా వినిపించినా హీరోయిన్ పేరు ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత.. నితిన్ సమంత కాంబినేషన్లో అఆ సినిమా వచ్చింది.అయితే ఈ సినిమా సమయంలో నితిన్ సరదాగా సమంతను ఆట పట్టిస్తూ ఉండేవాడట. కానీ సమంతకు మాత్రం ఆయన వేసే జోక్స్ అస్సలు నచ్చలేదట. ఇక విషయంలోకి వెళ్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సమంత హీరో హీరోయిన్లుగా అనుపమ సెకండ్ హీరోయిన్ గా చేసిన అఆ మూవీ అందరూ చూసే ఉంటారు.
అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంతతో ఉన్న చనువుతో నితిన్ సమంతపై కుళ్ళు జోకులు వేయడమే కాకుండా చీటికి మాటికి సమంత పై కామెంట్స్ చేశాడట.. దీంతో సమంత ఏ మూడ్ లో ఉందో ఏమో తెలియదు కానీ ఓరోజు నితిన్ ని ఎడాపెడా తిట్టేసిందట.. షూటింగ్ సెట్లో అంత మంది ఉన్నా కూడా సమంత అందరిముందే హేయ్ హద్దుల్లో ఉండు.. నీ పరిధి నువ్వు దాటకు.. ఇంకోసారి నా మీద నీ కుళ్ళు జోకులు వేస్తే బాగుండదు.. నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండు.. ఇంకొకసారి ఈ కామెంట్స్ నీ నోటి నుండి వినిపిస్తే మాత్రం బాగుండదు.. అంటూ అందరి ముందే వార్నింగ్ ఇచ్చిందట. ఇక అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడంతో సమంతకి అంత కోపం ఎందుకు వచ్చింది.. సమంతకి అంతలా కోపం వచ్చే పని నితిన్ ఏం చేశాడు అని అందరూ ఈ విషయం గురించే చర్చించుకున్నారు.