తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది దర్శకులకు మాత్రమే ఇండస్ట్రీలో మంచి నేమ్ ఫేమ్ ఉంటుంది.అయితే ఆ డైరెక్టర్స్ ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీసిన కూడా వారికి వచ్చిన స్టార్డం మాత్రం ఇసుమంతైన తగ్గదు. అలాంటి వారిలో ఒకరే పూరి జగన్నాథ్. స్టార్ టాలీవుడ్ డైరెక్టర్ గా ఉన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చాలామంది హీరోలు స్టార్స్ గా మారారు. అయితే ఈయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండడంతో చాలామంది యూత్ ఈయన సినిమాలకు కనెక్ట్ అవుతారు.
అలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అనేది ఆయన అభిమానుల నమ్మకం.. అలా ఇప్పటికే ఈయన దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టాయి. అలాగే మహేష్ బాబు రవితేజ వంటి హీరోలకు ఈయన ద్వారా స్టార్డం కూడా లభించింది. అయితే అలాంటి పూరి జగన్నాథ్ ని ఓ డైరెక్టర్ తల్లి చంపేయాలని చూసిందట. మరి ఆమె ఎవరు.. ఎందుకు పూరి జగన్నాథ్ ని చంపేయాలని చూసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
పూరి జగన్నాథ్ ని చంపేయాలని చూసింది ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తల్లి. అయితే ఇదేదో పగతో కాదు. ఇక అసలు విషయం ఏమిటంటే.. పూరీ జగన్నాథ్ ఆలీతో జాలీగా అనే టాక్ షోలో పాల్గొన్న సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ ఎటైనా విదేశాలకు వెళ్లి వచ్చాక వెంటనే నేను జగన్ దగ్గరికి వెళ్తున్నాను. జగన్ ని కలసి వస్తాను అని ప్రతిసారి ఆయన తల్లితో నాపేరే చెప్పేవారట. దాంతో కొడుకు విదేశాల నుండి వచ్చి కాసేపు మాట్లాడదాం అనుకుంటే వీడేంటి పూరి జగన్నాధ్ దగ్గరికి ప్రతిసారి వెళ్తున్నాడు అని వాళ్ళ అమ్మ కాస్త కోపగించుకునేదట.
అయినప్పటికీ రాంగోపాల్ వర్మ ప్రతిసారి నా దగ్గరికి వచ్చేయడంతో ఓసారి రాంగోపాల్ వర్మ తల్లి నా దగ్గరికి వచ్చి ప్రతిసారి వాడు నీ దగ్గరికి వస్తానని చెబుతున్నాడు. అందుకే నేను నిన్ను చంపేయాలనుకున్నాను అంటూ వర్మ తల్లి నాతో చాలా సార్లు చెప్పింది.. అంటూ పూరి జగన్నాథ్ నవ్వుతూ ఈ విషయాన్ని పంచుకున్నారు. అయితే పూరి జగన్నాథ్ అంటే రాంగోపాల్ వర్మ కి చాలా ఇష్టమట.అందుకే టైం దొరికితే పూరి జగన్నాథ్ తో మాట్లాడాలని ఇంటికి వస్తారట.