Moviesఎట్ట‌కేల‌కు వీడిన నాగ చైత‌న్య-స‌మంత విడాకుల ర‌హ‌స్యం.. సెన్సేష‌న్‌గా సోషల్ మీడియా...

ఎట్ట‌కేల‌కు వీడిన నాగ చైత‌న్య-స‌మంత విడాకుల ర‌హ‌స్యం.. సెన్సేష‌న్‌గా సోషల్ మీడియా పోస్ట్!

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య రెండో పెళ్లికి రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత కాలం నుంచి ప్ర‌ముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల‌తో సీక్రెట్ ల‌వ్ మెయింటైన్ చేస్తున్న చైతు.. ఇప్పుడు త‌మ బంధాన్ని అఫీషియ‌ల్ చేశాడు. ఆగ‌స్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకుని హాఫ్‌ క‌పుల్ అయిపోయారు. ఇక ఇదే త‌రుణంలో నాగ చైత‌న్య‌, స‌మంత విడాకుల ర‌హ‌స్యం కూడా వీడింది. గ‌తంలో స‌మంత బెస్ట్ ఫ్రెండ్ అండ్ పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జూకల్కర్ పెట్టిన సోష‌ల్ మీడియా పోస్ట్ ఇప్పుడు సెన్సేష‌న్ గా మారింది.

2017లో నాగ చైత‌న్య‌, స‌మంత గోవాలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో ల‌వ్లీ క‌పుల్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ అనూహ్యంగా 2021లో ఈ జంట విడాకుల‌తో త‌మ బంధాన్ని ముగించారు. ఆ స‌మ‌యంలో అంద‌రూ స‌మంత‌నే టార్గెట్ చేశారు. పెళ్లి త‌ర్వాత స‌మంత బోల్డ్ రోల్స్ చేయడమే విడాకుల‌కు కార‌ణ‌మైంద‌ని కొంద‌రు నిందించారు. అలాగే స‌మంత పిల్ల‌ల‌ను క‌న‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేనందు వ‌ల్లే చైతు ఆమెతో విడిపోయాడ‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది.

ఒకానొక స‌మ‌యంలో పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జూకల్కర్ తో కూడా స‌మంత‌కు ఎఫైర్ అంట‌గ‌ట్టి మాన‌సికంగా ఆమెను కృంగ‌దీశారు. కానీ నాగ చైత‌న్య‌, స‌మంత విడాకుల స‌మ‌యంలో ప్రీతం జూకల్కర్ ఓ పోస్ట్ పెట్టాడు. కంగ్రాట్స్ పతిత.. ఇప్పుడు అతడు నీ వాడు. రహస్యాలు, అబద్ధాలు బంధాలను నాశనం చేస్తాయి. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దొరికిపోతారు అని ఇన్‌స్టా స్టేట‌స్ లో ప్రీతం రాసుకొచ్చాడు. ఆ టైమ్ లో ఎవ‌రికీ అత‌ని పోస్ట్ అర్థం కాలేదు. ప‌తిత అని ఎవ‌ర్ని ఉద్ధేశించి అన్నాడో కూడా తెలియ‌లేదు.

కానీ శోభిత‌తో చైతు ఎంగేజ్మెంట్ అయిన నేప‌థ్యంలో.. ఆనాడు ప్రీతం పెట్టిన పోస్ట్ పై అంద‌రికీ ఇప్పుడో క్లారిటీ వ‌చ్చినట్లైంది. మ్యారేజ్ త‌ర్వాత శోభితతో రిలేషన్ పెట్టుకున్న నాగ చైతన్య సమంతను మోసం చేశాడు. ఈ విషయం తెలిసి సమంత విడాకులు తీసుకుంది. శోభిత వ‌ల్లే నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోయారు. ఇదే ప్రీతం జూకల్కర్ పోస్ట్ వెన‌క ఉన్న అర్థమ‌ని.. అత‌ను ప‌తిత అన్న‌ది కూడా శోభిత‌నే అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news