లక్ష్మీ కళ్యాణం, చందమామ వంటి సినిమాలతో తెలుగు సినీ చరిత్ర లో చందమామగా మారిపోయిన కాజల్ అగర్వాల్ నిజంగానే ఆ టాలీవుడ్ హీరోని ప్రేమించిందా.. మరి అంత గాఢంగా ప్రేమించిన హీరోయిన్ పెళ్లెందుకు చేసుకోలేదని భావిస్తూ ఉంటారు కొంతమంది నెటిజన్స్. మరి కాజల్ అగర్వాల్ ప్రేమించిన తెలుగు హీరో ఎవరు? ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఇప్పుడు చూద్దాం..
కాజల్ అగర్వాల్ తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన సమయంలో తన ఫ్రెండ్ చేసుకోబోయే భర్త సైడ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూ తో ప్రేమలో పడి దాదాపు 10 సంవత్సరాలు ప్రేమించుకొని చివరికి పెళ్లి చేసుకొని ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ అప్పట్లో నటుడు దగ్గుబాటి రానాతో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. ఇక రానా, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దగ్గుబాటి రానా, కాజల్ ల మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడి ఇద్దరు ప్రేమలో పడ్డారనే టాక్ ఫిలింనగర్ లో చక్కర్లు కొట్టింది.
అంతేకాదు కాజల్ ఓ అడుగు ముందుకు వేసి దగ్గుబాటి రానాని పెళ్లి చేసుకుంటానని కూడా నిర్ణయించుకుందట. అయితే ఈ విషయం తెలుసుకున్న కాజల్ తండ్రి నీకు ఇప్పుడే పెళ్లి వద్దు. మొదట సినిమాలపై ఫోకస్ పెట్టు అని వార్నింగ్ ఇచ్చారనే న్యూస్ వినిపించింది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే ఇది రూమర్ మాత్రమే.ఇక అసలు నిజం ఏంటంటే.. కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూతో చాలా సంవత్సరాల నుండి ప్రేమలో ఉంది. అలాంటిది రానా తో ప్రేమ ఏంటి అని కొంతమంది ఈ విషయాన్ని కొట్టి పారేశారు. అంతేకాకుండా రానా, కాజల్ మధ్య ప్రేమాయణం నడిచింది అనే వార్త పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది.