మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అయితే కెరీర్ ఆరంభం నుంచి కథల ఎంపికలో తన తండ్రి చిరంజీవి సలహాలు, సూచనలు తీసుకోవడం రామ్ చరణ్ కు ఉన్న అలవాటు.
కానీ ఒకసారి చిరంజీవి వద్దన్నా వినకుండా రామ్ చరణ్ ఓ మూవీలో యాక్ట్ చేశాడు. చివరకు విమర్శల పాలయ్యాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు జంజీర్. బాలీవుడ్ లో రామ్ చరణ్ డెబ్యూ ఫిల్మ్ ఇది. తెలుగులో తుఫాన్ పేరుతో విడుదలైంది. నాయక్ వంటి సూపర్ హిట్ అనంతరం రామ్ చరణ్ కు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అపూర్వ లఖియా దర్శకత్వంలో జంజీర్ అనే యాక్షన్ క్రైమ్ మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చింది.
స్టోరీ బాగుండటం, పైగా బాలీవుడ్ మూవీ కావడంతో రామ్ చరణ్ జంజీర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే చిరంజీవి మాత్రం ఈ కథ నీకు సెట్ కాదని.. వదిలేయమని సూచించారట. రామ్ చరణ్ తండ్రి మాటలను అంగీకరించలేదు. ఒక అడుగు ముందుకేసి జింజీర్ చేశాడు. ఇది హిందీ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడింది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
అయితే భారీ అంచనాల నడుమ 2013లో విడుదలైన జంజీర్ మూవీ తొలి ఆట నుంచే నెగెటివ్ రివ్యూలను మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దానికి తోడు బాలీవుడ్ మీడియా రామ్ చరణ్ లుక్స్ మరియు యాక్టింగ్ పై దారుణమైన విమర్శులు చేసింది. జంజీర్ రిజల్డ్ చూసి చరణ్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక ఆ తర్వాత చిరంజీవి వద్దు అన్న సినిమా వైపు రామ్ చరణ్ కన్నెత్తి చూసే సహాసం కూడా చేయలేదు.