సీనియర్ హీరో నాగార్జున మార్కెట్ ఎప్పుడో పడిపోయింది. అసలు నాగార్జున సినిమాలు వస్తున్నాయి అంటే చాలు అక్కినేని అభిమానులు తొలిరోజు తొలి షో కూడా చూడటం లేదు. నాగర్జున సినిమాలుకు బెనిఫిట్ షోలు పడి చాలా ఏళ్లు అవుతోంది. అసలు నాగార్జున సినిమా వస్తుంది అంటే ఎవరు పట్టించుకోని పరిస్థితి. అలాంటి నాగార్జునకు ఏకంగా రూ.24 కోట్ల రెమ్యూనరేషన్ అంటే చాలా ఆశ్చర్యకరం అని చెప్పాలి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కూలీ. ఈ సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న డాన్ పాత్ర ఒకటి ఉంది. దానిని చేయమని తెలుగు సీనియర్ హీరో నాగార్జునకు ఆఫర్ వచ్చింది. చాలా హై రెమ్యూనరేషనట్తో ఈ డీల్ కు నాగ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు నాగార్జున రెమ్యూనరేషన్ సోలో హీరోగా ఐదారు కోట్ల వరకు ఉంది. మధ్యలో ఒకటి, రెండు హిట్ సినిమాలు పడినప్పుడు మాత్రమే రు. 7 – 8 కోట్లు తీసుకున్నారు. నాగార్జునకు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే చాలా చాలా ఎక్కువ. అలాంటిది ఏకంగా రూ.24 కోట్ల రెమ్యూనరేషన్‌తో కూలీ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఇండస్ట్రీ అంతా ఆశ్చర్య పోతుంది.
కూలీ పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు.. విలన్ షేడ్స్ ఉండే డాన్ పాత్ర కావడంతో.. నాకు అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. నిర్మాతలు కూడా ఓకే అన్నారు. ఇక లోకేష్ కనకరాజ్ సినిమా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. పైగా నాగార్జున ఉంటే తెలుగులో కూడా ఈ సినిమాకు అదిరిపోయే మార్కెట్ ఉంటుంది. అందువల్ల ఎంత ఇచ్చిన అంతకు అంత బిజినెస్ జరుగుతుందన్న నమ్మకంతోనే నిర్మాతలు నాగ్ అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.